Petrol Rate: గ్యాస్ సిలిండర్ పై రూ. 200 తగ్గింపు..త్వరలో పెట్రోల్ ,డీజిల్ పై రూ. 30 తగ్గించే చాన్స్..కారణం ఇదే

By Krishna Adithya  |  First Published Aug 29, 2023, 8:49 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని గతంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్ పై ధరలు తగ్గించిన వేళ గుర్తు చేసుకుంటున్నారు. గ్యాస్ బండపై ఉపశమనం కల్పించిన వేళ పెట్రోల్ డీజిల్ పై కూడా ఉపశమనం కల్పించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు


 కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్లపై ఏకంగా 200 రూపాయల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో దేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా గృహ ఉపయోగాలకు  వాడే ఎల్పిజి సిలిండర్ల ధర 1100 రూపాయలు దాటిపోయింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం  ఈ తగ్గింపు సామాన్య ప్రజలకు ఊరట కల్పించండి.  అలాగే ఉజ్వల్ యువజన కింద సిలిండర్లు తీసుకున్న వారికి ఏకంగా 400 రూపాయలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిపై కూడా సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. . ఇదిలా ఉంటే రాబోయే కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు,  అలాగే 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  కాగా ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్లతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 దీని వెనుక కారణం లేకపోలేదు గతంలో నిర్మల సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తామని దీనిపై ఆలోచిస్తున్నామని ప్రకటించారు.  ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు సైతం జిఎస్టి  పరిధిలోకి వచ్చినట్లయితే గరిష్ట స్థాయిలో పన్ను విధించినప్పటికీ ప్రస్తుతం ఉన్న పన్నులతో  పోల్చితే అది చాలా తక్కువ  అని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Latest Videos

 ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలు, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

"రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత, మేము పెట్రోలియం ఉత్పత్తులను కూడా GST పరిధిలోకి తీసుకువస్తాము" అని PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన పోస్ట్-బడ్జెట్ సెషన్‌లో  ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది పరిశ్రమల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో, పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో సహాయపడుతుందని విశ్లేషకులు వాదిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ జీఎస్టీలోకి తెస్తే లీటర్ పెట్రోల్ ధర ఎంత..? 

ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టి పరిధిలోకి వచ్చినట్లయితే గరిష్టంగా అమల్లో ఉన్నటువంటి జీఎస్టీ  28 శాతంగా ఉంది. ఈ లెక్కన చూసినట్లయితే  పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతం VAT  పన్ను ధర దాదాపు 35 శాతం గా ఉంది  అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ ధర లీటరుకు 19 రూపాయలుగా ఉంది.  నిజానికి పెట్రోల్ ఒక లీటరు ప్రస్తుతం మార్కెట్లో డీలర్ కు  57 రూపాయలకే లభిస్తోంది.  పన్నులతో కలుపుకొని  పెట్రోల్ ధర లీటర్కు సుమారు 109 రూపాయలుగా పలుకుతోంది.  ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు కనుక వచ్చినట్లయితే లీటర్ పెట్రోల్ పై కేవలం 28% టాక్స్ మాత్రమే పడుతుంది.  అప్పుడు గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 80 రూపాయలు మాత్రమే లభించే అవకాశం ఉంది.  ఈ లెక్కన చూస్తే దాదాపు 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. 

click me!