
నేడు ఆగస్ట్ 24న పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ ఇంధన రిటైలర్లు విడుదల చేసిన తాజా ధరల నోటిఫికేషన్ తెలిపింది. అయితే గత 3 నెలలకు పైగా ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31కి, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62. చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉన్నాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.13.08, డీజిల్‌పై రూ.24.09 నష్టపోతున్నట్లు సమాచారం. భారతదేశం ఇంధన అవసరాలలో 80 శాతం దిగుమతుల పై ఆధారపడుతుంది.
గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మంగళవారం 3.9% పెరిగిన తర్వాత 0114 GMT నాటికి 21 సెంట్లు లేదా 0.2% పడిపోయి బ్యారెల్ $100.01కి చేరుకుంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 10 సెంట్లు లేదా 0.1% తగ్గి బ్యారెల్ $93.64 వద్ద ఉంది.
అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంధన ధరలు తగ్గుతాయని సామాన్యులు భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో పెట్రోలు, డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయి.
పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్-డీజిల్ అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. ఇక్కడ లీటరు పెట్రోలు ధర రూ.84.10 కాగా, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ కొత్త ధరలను నిర్ణయిస్తాయి.
అలాగే ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదలవుతాయి. ఈ ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించడం వల్ల దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది.