
భారతదేశంలో చాలా కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఈ అంశం ఇప్పుడు పార్లమెంట్‌లోనూ ప్రస్తావనకు వచ్చింది. లోక్‌సభలో విపక్షాల ప్రశ్నలపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి మాట్లాడుతూ.. ధరలు తగ్గించేందుకు వీలుగా ప్రతిపక్ష సభ్యుల పార్టీలు పాలించే రాష్ట్రాల్లో వ్యాట్‌ను తగ్గించాలని అన్నారు. కేంద్రం రెండుసార్లు వ్యాట్ తగ్గించిందని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు తగ్గించలేదన్నారు.
ఈరోజు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈరోజు ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన ధర ప్రకారం డిసెంబర్ 16న పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అన్ని మెట్రో నగరాల నుండి వివిధ రాష్ట్రాలలో ఇంధన ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
ఢిల్లీ: లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62
ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27
కోల్‌కతా : లీటరు పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76
చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24
హైదరాబాద్: లీటరు పెట్రోల్ ధర రూ.109.66. డీజిల్ ధర లీటరుకి రూ.97.82
ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్ ధర రూ.89.75గా ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24 వద్ద స్థిరంగా ఉంది.
భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రపంచ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయని హర్దీప్ పూరి పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో విధించే పన్ను కారణంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి.
మీరు ఇంధన ధరలను సులభంగా ఎస్‌ఎంఎస్ ద్వారా చెక్ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అని టైప్ చేసి 9224992249కి SMS పంపవచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కస్టమర్‌లు HPPRICE అని టైప్ చేసి 9222201122కి SMS పంపాలి. భారత్ పెట్రోలియం కస్టమర్‌లు RSP అని టైప్ చేసి 9223112222కి పంపాలి.