సామాన్యులకు ఇంధన ధరలపై రిలీఫ్.. పండగ సీజన్ లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

By asianet news teluguFirst Published Jan 12, 2023, 10:20 AM IST
Highlights

, గత ఏడాది మే 22న దేశవ్యాప్తంగా ఇంధన ధరలు చివరిసారిగా దిగోచ్చాయి. తరువాత,  కొన్ని రాష్ట్ర ప్రభుత్వలు కూడా పెట్రోల్, డీజిల్‌పై  విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయి. 

నేడు వరుసగా 236వ రోజు గురువారం కూడా అంటే జనవరి 12 న పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి . 2022 మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత, గత ఏడాది మే 22న దేశవ్యాప్తంగా ఇంధన ధరలు చివరిసారిగా దిగోచ్చాయి. తరువాత,  కొన్ని రాష్ట్ర ప్రభుత్వలు కూడా పెట్రోల్, డీజిల్‌పై  విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది. 

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధరలు రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.  హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. 

బ్రెంట్ ఫ్యూచర్స్ $2.57 లేదా 3.2 శాతం పెరిగి బ్యారెల్ $82.67 వద్ద స్థిరపడింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ $2.29 లేదా 3.1 శాతం పెరిగి $77.41 వద్ద స్థిరపడింది.

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

click me!