నేడు పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు ఇవే.. మీ నగరంలో ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Mar 20, 2023, 10:15 AM IST
Highlights

మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని  రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి. పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 90 పైసల సెస్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. 

నేడు మార్చి 20న సోమవారం ఇంధన ధరలు 2023  స్థిరంగా ఉన్నాయి. దీంతో దాదాపు తొమ్మిది నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు.  ఈ రోజు  దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.96.72గా ఉండగా,  డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతాయి, వాల్యు ఆధారిత పన్ను (VAT), సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది మే 21న ఫైనాన్స్ సమయంలో ఇంధన ధరలను చివరి సారిగా దేశవ్యాప్త మార్పు జరిగింది. అప్పట్లో పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు.

మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని  రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి. పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 90 పైసల సెస్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ కూడా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ రెండవ పూర్తి బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ఇంకా మద్యంపై సెస్‌ను ప్రకటించారు. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 సామాజిక భద్రత సెస్ విధించబడుతుంది.


ప్రముఖ నగరాల్లో ఇంధన ధరలు:

చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ 102.63, డీజిల్ ధర  రూ 94.24

కోల్‌కతా: ఈరోజు పెట్రోల్ ధర  లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర  రూ. 92.76

బెంగళూరు: పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర  రూ. 87.89

లక్నో: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

గురుగ్రామ్: పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05

చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  కొన్ని నెలలుగా  రూ.109.66 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర లీటర్‌ రూ. 97.82 గా ఉంది.

 బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ గత వారం దాదాపు 12% నష్టం తర్వాత 0007 GMT నాటికి బ్యారెల్‌కు 35 సెంట్లు లేదా 0.5% పెరిగి $73.32కి చేరుకుంది, డిసెంబర్ తర్వాత దాని అతిపెద్ద వీక్లీ పతనం.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. 

click me!