గత 5 రోజుల పెంపు తర్వాత నేడు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

By Sandra Ashok KumarFirst Published Nov 25, 2020, 3:08 PM IST
Highlights

 ముడిచమురు ధరలు మార్చి తరువాత మొదటిసారిగా బ్యారెల్కు $ 47 కు చేరుకున్నాయి. కోవిడ్ -19ను అధిగమించాలనే అంచనాలతో 2021లో ఇంధన వినియోగం పెరిగే అవకాశం ఉందని చమురు బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.

కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలు సోమవారం ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలను రెండు శాతానికి పైగా పెంచాయి, దీంతో ఇంధన ధరలు గత కొద్దిరోజుల క్రితం పెరిగాయి. ముడిచమురు ధరలు మార్చి తరువాత మొదటిసారిగా బ్యారెల్కు $ 47 కు చేరుకున్నాయి.

కోవిడ్ -19ను అధిగమించాలనే అంచనాలతో 2021లో ఇంధన వినియోగం పెరిగే అవకాశం ఉందని చమురు బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ పై నిరంతర పరీక్షలు కూడా త్వరలో టీకా వస్తుంది అనే ఆశలు పెంచుకుంది.

పెరిగిన డిమాండ్ కారణంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 46.72కు పెరిగింది. మార్చి 6 నుండి ఇది అత్యధిక స్థాయి. డబ్ల్యూటీఐ కూడా బ్యారెల్‌కు 43.38 చొప్పున విక్రయించింది.

ముడి చమురు ధరలను నియంత్రించడానికి ఒపెక్, దాని మిత్రదేశాలు ఉత్పత్తిని 120 మిలియన్ బారెల్స్ తగ్గించాయి, అయితే అంటువ్యాధి ఒత్తిడితో మార్చి నుండి ముడిచమురు ధరలు $ 40 వరకు ఉన్నాయి.

also read 

ఢీల్లీలోని పెట్రోల్ 5 రోజుల్లో 95 పైసలు పెరిగి లీటరుకు 81.59 రూపాయలకు చేరుకుంది. 2021 ప్రారంభంలో ముడి చమురు బ్యారెల్‌కు $58 కు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఉత్పత్తి, ధరల పై ఒపెక్ దేశాలు నవంబర్ 30న సమావేశం కానున్నాయి.

అంతర్జాతీయ చమురు రేట్ల నేపథ్యంలో వరుసగా ఐదు రోజుల పెరుగుదల తర్వాత నేడు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులేదు. దీని ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .81.59 వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ .71.41 వద్ద కొనసాగింది. ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇంధన ధరలు మారలేదు.

ఇంధన ధరల సవరణలో దాదాపు రెండు నెలల విరామం తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం నుండి పెరుగుతు వస్తున్నాయి. ఐదు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు 53 పైసలు, డీజిల్ ధర లీటరుకు 95 పైసలు పెరిగింది.

నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.85.86, డీజిల్ ధర రూ.77.93, ముంబైలో పెట్రోల్ ధర రూ.88.29, డీజిల్ ధర రూ.77.90, చెన్నైలో పెట్రోల్ ధర రూ.84.64 ఉండగా డీజిల్ ధర రూ.76.88.
 

click me!