కేవలం ఒక్క ఎస్‌ఎం‌ఎస్ లేదా మిస్డ్ కాల్‌తో మీ పి‌ఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే ?

By Sandra Ashok KumarFirst Published Nov 25, 2020, 1:28 PM IST
Highlights

 పిఎఫ్ ఖాతా గురించి వివరాలు, పి‌ఎఫ్ విత్ డ్రా గురించి సమాచారం తెలియని వారు చాలా మంది ఉన్నారు. పిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి మొదలైనవి కూడా కొందరికి తెలియదు.

కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఎంతో మంది వారి ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) నుండి డబ్బును కూడా ఉపసంహరించుకోవలసి వచ్చింది, కాని వారి పిఎఫ్ ఖాతా గురించి వివరాలు, పి‌ఎఫ్ విత్ డ్రా గురించి సమాచారం తెలియని వారు చాలా మంది ఉన్నారు.

పిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి మొదలైనవి కూడా కొందరికి తెలియదు. ఇపిఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న పిఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి  చాలా మార్గాలు ఉన్నప్పటికీ, సులభమైన మార్గం ఏంటంటే మిస్డ్ కాల్ లేదా  ఎస్‌ఎం‌ఎస్ ద్వారా పొందడం..

మిస్డ్ కాల్ కోసం ఈ నంబర్‌కు కాల్ చేయండి

మిస్డ్ కాల్ ద్వారా మీరు పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందు కోసం మీరు మీ పిఎఫ్ ఖాతా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కు మిస్డ్ కాల్ చేయాల్సి ఉంటుంది. దీని తరువాత మీకు మీ ఖాతాలోని పిఎఫ్ డబ్బు గురించి సమాచారం వస్తుంది.

also read 

 ఎస్‌ఎం‌ఎస్ ద్వారా పి‌ఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవటానికి

మీరు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే ఈ రెండు సేవలకు మీ యూ‌ఏ‌ఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఆక్టివేట్ గా ఉండాలి. మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా పి‌ఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈ‌పి‌ఎఫ్‌ఓ‌హెచ్‌ఓ యూ‌ఏ‌ఎన్ అని టైప్ చేసి 7738299899 కు ఎస్‌ఎం‌ఎస్ పంపండి.

మీరు మీ పి‌ఎఫ్ సమాచారాన్ని హిందీ, ఇంగ్లీష్, పంజాబీతో సహా 10 భాషలలో పొందవచ్చు. ఉదాహరణకు, మీరు హిందీలో పి‌ఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, ఈ‌పి‌ఎఫ్‌ఓ‌హెచ్‌ఓ యూ‌ఏ‌ఎన్ హెచ్‌ఐ‌ఎన్ అని టైప్ చేసి 7777299899 ఎస్‌ఎం‌ఎస్ పంపండి.

ఇతర భాషలలో సమాచారం పొందటానికి 
1. ఇంగ్లీషుకు కోడ్ లేదు

2. హిందీ కోసం-హెచ్‌ఐ‌ఎన్ 

3. పంజాబీ కోసం- పి‌యూ‌ఎన్ 

4. గుజరాతీ కోసం- జి‌యూ‌జే 

5. మరాఠీ కోసం- ఎంఏఆర్

6. కన్నడ కోసం - కే‌ఏ‌ఎన్ 

7. తెలుగు కోసం- టి‌ఈ‌ఎల్

8. తమిళం కోసం- టి‌ఏ‌ఎం

9. మలయాళం కోసం - ఎంఏఎల్

10 బెంగాలీ కోసం- బి‌ఈ‌ఎన్

click me!