Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

By team teluguFirst Published Jun 28, 2022, 8:46 AM IST
Highlights

కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
 

దేశవ్యాప్తంగా మంగళ‌వారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంధన రేట్లలో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మే 21న పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా లీటర్‌ పెట్రోల్‌ 9.50 రూపాయలు, డీజిల్‌పై 7 రూపాయలు తగ్గింది. 

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి మంగళ‌వారం (జూన్ 28, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా మంగళ‌వారం కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది. 


పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.72 కాగా, డీజిల్‌ రూ. 89.62 వద్ద కొనసాగుతోంది.
 
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.35 కాగా, డీజిల్‌ రూ. 97.28గా ఉంది. 

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.63 కాగా, డీజిల్ రూ. 94.24గా నమోదైంది. 

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.94 కాగా, డీజిల్‌ రూ. 87.89 వద్ద కొనసాగుతోంది. 

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.03 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 92.76గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.66 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 97.82గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.09కాగా, డీజిల్‌ రూ. 99.81గా ఉంది.

భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

click me!