petrol diesel price today:ఇంధన ధరలు @75 రోజులు.. స్థిరంగా సెంచరీకి చేరువలో పెట్రోల్, డీజిల్ ధరలు..

By asianet news teluguFirst Published Jan 20, 2022, 9:12 AM IST
Highlights

చమురు కంపెనీలు(oil companies) గురువారం పెట్రోల్-డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. దీంతో మరోసారి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోలు(petrol), డీజిల్(diesel) రేట్లు చాలా కాలంగా  స్థిరంగా కొనసాగుతున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర రూ.86.67 చొప్పున విక్రయిస్తున్నారు.  

ప్రభుత్వ చమురు కంపెనీలు నేడు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గత 75 రోజులు పరిశీలిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. 4 నవంబర్ 2021 నుండి వాహన ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేదు. గత ఏడాది దీపావళి (diwali)కానుకగా కేంద్ర ప్రభుత్వం (central government)పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుంచి చాలా నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ రూ.100కి  దగ్గరగా దిగోచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ లీటరు రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 చొప్పున విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ సుంకం (excise duty)తగ్గింపుకు ముందు, వాహన ఇంధన ధరలు దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. చాలా నగరాల్లో ఇప్పటికీ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. కొన్ని నగరాల్లో డీజిల్ కూడా లీటరుకు రూ.100 పైగానే ఉంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.95.28, డీజిల్ రూ.86.80 చొప్పున విక్రయిస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పెట్రోల్‌పై వ్యాట్‌ను ప్రస్తుతం ఉన్న 30 శాతం నుండి 19.4 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో వ్యాట్ తగ్గింపు తర్వాత పెట్రోల్ ధర లీటరుకు ప్రస్తుతం ఉన్న రూ.103 నుంచి రూ.95కి దిగోచ్చింది.

దేశంలోని 4 మెట్రోలతో సహా ప్రధాన నగరాల్లో నేటి ఇంధన ధరలు
- ఢిల్లీ పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ. 86.67
- ముంబై పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్ ధర రూ. 94.14
- చెన్నై పెట్రోల్ ధర రూ. 101.40, డీజిల్ ధర రూ. 91.43
- కోల్‌కతా పెట్రోల్ ధర రూ. 104.67, డీజిల్ ధర లీటరుకు రూ. 89.79
- గాంధీనగర్ పెట్రోల్ ధర రూ. 95.35, డీజిల్ ధర రూ. 89.33
- లక్నో పెట్రోల్ ధర రూ. 95.28, డీజిల్ ధర రూ. 86.80
- పోర్ట్ బ్లెయిర్ పెట్రోల్ ధర రూ. 82.96, డీజిల్ ధర రూ. 77.13
- హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.108.20 లీటర్, డీజిల్ ధర  రూ .94.62

 ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త ధరలుఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

click me!