Petrol Diesel Prices Today: మ‌రోసారి పెట్రో మంట‌.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్‌ రూ. 115..!

Published : Mar 31, 2022, 07:59 AM IST
Petrol Diesel Prices Today: మ‌రోసారి పెట్రో మంట‌.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్‌ రూ. 115..!

సారాంశం

ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఇంకా గరిష్ట స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కూడా ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా రేట్లను పెంచుకుంటూనే వెళ్తున్నాయి.  

పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం (మార్చి 31, 2022) మ‌రోసారి పెరిగాయి. గురువారం ఆయిల్ కంపెనీలు మ‌రోసారి వాహ‌న‌దారుల‌కు షాకిచ్చాయి. వ‌రుస‌గా 10 రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గడం ఇది 9వ సారి. చ‌మురు సంస్థలు  లీట‌ర్ పెట్రోల్‌పై 80 పైస‌లు, డీజిల్‌పై 80 పైస‌లు చొప్పున పెంచాయి. హైద‌రాబాద్‌లో పెట్రోల్ లీట‌ర్‌ రూ. 115.40 కాగా.. డీజిల్ లీట‌ర్‌ రూ. 101.56కు చేరింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి గురువారం (మార్చి 31, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా గురువారం పెట్రోల్‌పై 80 పైస‌లు, డీజిల్‌పై 80 పైస‌లు పెరిగాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.81 కాగా, డీజిల్‌ రూ. 93.07 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 116.70 కాగా, డీజిల్‌ రూ. 100.93గా ఉంది.

-  చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.43 కాగా, డీజిల్ రూ. 97.50గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 107.28 కాగా, డీజిల్‌ రూ. 91.25 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 111.34 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 96.20గా ఉంది.

- ల‌క్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.64 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.20గా ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 115.40 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 101.56గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 117కాగా, డీజిల్‌ రూ. 103కి చేరింది.

- గుంటూరులో పెట్రోల్ లీట‌ర్‌ రూ.117.32కాగా, డీజిల్ ధర రూ.103.10కి చేరింది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు