Petrol Diesel Prices Today: భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధ‌ర‌లు.. నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 04, 2022, 08:58 AM IST
Petrol Diesel Prices Today: భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధ‌ర‌లు.. నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే..?

సారాంశం

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 113 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 111 డాలర్లు దాటింది. ఇది పదేళ్ల గరిష్టం. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. 

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 113 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 111 డాలర్లు దాటింది. ఇది పదేళ్ల గరిష్టం. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 04, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకుపైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. 

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.04, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.17

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.21, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.83

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.14, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.68

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 102.17, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.97

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HPPrice అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు