Petrol Diesel Prices Today: స్థిరంగా ధ‌ర‌లు.. నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే..!

Published : Feb 17, 2022, 09:29 AM IST
Petrol Diesel Prices Today: స్థిరంగా ధ‌ర‌లు.. నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే..!

సారాంశం

సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా మన వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ ఇండియా ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (ఫిబ్రవరి 17, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. 

సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశముంది.

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.68, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.24, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.29, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.56

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 102.10, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. క్రూడ్ ధరలు 93 డాలర్ల కిందకు క్షీణించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.63 శాతం పెరిగింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 92.37 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 2.71 శాతం తగ్గింది. దీంతో ఈ రేటు 91.12 డాలర్లకు తగ్గింది.

కాగా భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Gold Silver Price: ట్రంప్ ఓటమి.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. బంగారం ధరలు మళ్లీ జంప్
Jio Recharge Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3 ఏళ్లు బిందాస్.. జియో నుంచి కొత్త ప్లాన్