వాహనదారులకు రిలీఫ్: నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Jan 9, 2023, 9:19 AM IST
Highlights

జనవరి 9న తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 కాగా, డీజిల్ ధర రూ.89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78 డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85 డాలర్లకి పడిపోయింది.
 

న్యూఢిల్లీ : భారతదేశం అంతటా నేడు ఇంధన ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కొత్త ఇంధన ధరల ప్రకటిస్తాయి. అయితే, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత ఏడు నెలలుగా యధాతధంగా ఉంచాయి. భారతదేశం అంతటా ఇంధన ధరలు చివరిసారిగా మేలో సవరించబడ్డాయి. కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు మే 21న పెట్రోల్, డీజిల్‌ ధరల పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున పన్ను తగ్గించారు.

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
జనవరి 9న తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 కాగా, డీజిల్ ధర రూ.89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ బెంగళూరులో  పెట్రోల్‌ ధర  లీటర్‌కు రూ. 101.94, డీజిల్‌ ధర రూ. 87.89.

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78 డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85 డాలర్లకి పడిపోయింది.

నోయిడా
పెట్రోలు - లీటరు ధర రూ.96.79
డీజిల్ - లీటరు ధర రూ.89.96
గుర్గావ్
పెట్రోలు - లీటరు ధర రూ.97.18
డీజిల్ - లీటరు ధర రూ.90.05
చండీగఢ్
పెట్రోలు - లీటరు ధర రూ.96.20
డీజిల్ - లీటరు ధర  రూ.84.26
చెన్నై
పెట్రోలు - లీటరు ధర  రూ.102.63
డీజిల్ - లీటరు ధర  రూ.94.24
కోల్‌కతా
పెట్రోలు - లీటరు ధర  రూ.106.03
డీజిల్ - లీటరు ధర రూ. 92.76
లక్నో
పెట్రోలు - లీటరు ధర రూ.96.62
డీజిల్ - లీటరు ధర రూ.89.81. 

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

నెలల తరబడి 
గత ఏడాది మే నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్తంభింపజేయడం వల్ల జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో OMCలకు మొత్తం రూ. 2,748.66 కోట్ల భారీ నష్టాలు వచ్చాయి. అయితే, గ్లోబల్ క్రూడ్ బలహీనంగా ఉన్నందున తక్కువ మార్కెటింగ్ ఖర్చులు, అధిక మార్జిన్ల ఫలితంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలు తక్కువగా ఉంటాయని అంచనా.

పెట్రోల్ డీజిల్ ధరలలో  ఏదైనా మార్పు ఉంటే కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

click me!