నేడు ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే: కొత్త ధరలు తెలుసుకోండి..

Published : Oct 12, 2022, 08:48 AM ISTUpdated : Oct 12, 2022, 08:50 AM IST
నేడు  ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే: కొత్త  ధరలు తెలుసుకోండి..

సారాంశం

ప్రపంచ ఆర్థిక మాంద్యం, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో కోవిడ్ -19 పరిమితులను కఠినతరం చేయడం వల్ల డిమాండ్ తగ్గుదల ఆందోళనల మధ్య గ్లోబల్ చమురు ధరలు బుధవారం వరుసగా మూడవ రోజు పడిపోయాయి.

కొద్దిరోజుల క్రితం క్రూడాయిల్ ధర రికార్డు కనిష్ట స్థాయి తర్వాత మళ్ళీ ఎగిసింది. కానీ ఇప్పుడు ముడి చమురు ధరల తగ్గుదల కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ధరలు పతనం కావడంతో ఒపెక్ దేశాలు (ఒపెక్) ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. దీని తర్వాత మరోసారి ముడిచమురు ధర పెరిగింది. అయితే గత రెండు రోజుల నుంచి మళ్లీ పతనం కనిపిస్తోంది.

ప్రపంచ ఆర్థిక మాంద్యం, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో కోవిడ్ -19 పరిమితులను కఠినతరం చేయడం వల్ల డిమాండ్ తగ్గుదల ఆందోళనల మధ్య గ్లోబల్ చమురు ధరలు బుధవారం వరుసగా మూడవ రోజు పడిపోయాయి.

చాలా కాలంగా ఒకే స్థాయిలో ధరలు 
నేటికీ పెట్రోలు-డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ముడిచమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 2022 మే 22న ప్రధాని నరేంద్ర  మోదీ ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గాయి.

గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గింపు
మరోవైపు మహారాష్ట్ర, మేఘాలయలో ఇంధన ధరల్లో మార్పు వచ్చింది. తాజాగా చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర మంగళవారం బ్యారెల్‌కు 88.64 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 93.75 డాలర్ల స్థాయిలో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బుధవారం బ్యారెల్‌కు 51 సెంట్లు లేదా 0.51% తగ్గి 93.78కి పడిపోయింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్‌కు  69 సెంట్లు లేదా 0.8% తగ్గి 88.66 వద్ద ఉంది.

నగరం, చమురు ధరలు (అక్టోబర్ 12న పెట్రోలు-డీజిల్ ధర)
- ఢిల్లీ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62
-ముంబైలో పెట్రోల్‌ ధర రూ.111.35, డీజిల్‌ ధర రూ.97.28
-చెన్నైలో  పెట్రోల్‌ ధర రూ.102.63, డీజిల్‌ ధర రూ.94.24
-కోల్‌కతా పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76. 
- లక్నోలో పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76 
- జైపూర్ లో పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ. 93.72  
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89
 -భువనేశ్వర్ పెట్రోలు ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76, 
- హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
- పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోలు రూ.84.10, డీజిల్ లీటరుకు రూ.79.74గా ఉంది

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఓ‌ఎం‌సిలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. VAT లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు