మండుతున్న క్రూడాయిల్ ధరలు.. నేడు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఎంతంటే..?

By asianet news teluguFirst Published Mar 28, 2023, 10:21 AM IST
Highlights

ప్రభుత్వ ఆయిల్ సంస్థల ప్రకారం,  గత 24 గంటల్లో బ్రెంట్ క్రూడ్ ధర $2 డాలర్లకు పైగా పెరిగి బ్యారెల్ ధర $77.93 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో డబ్ల్యుటిఐ ధర కూడా బ్యారెల్‌కు 3 డాలర్లు పెరిగి $72.75 డాలర్లకు చేరుకుంది.
 

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు మరోసారి ఒత్తిడిని పెంచడం ప్రారంభించాయి. గత 24 గంటల్లో క్రూడ్ ధర $2 కంటే పెరిగింది. కాగా, మంగళవారం ఉదయం ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

ప్రభుత్వ ఆయిల్ సంస్థల ప్రకారం,  గత 24 గంటల్లో బ్రెంట్ క్రూడ్ ధర $2 డాలర్లకు పైగా పెరిగి బ్యారెల్ ధర $77.93 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో డబ్ల్యుటిఐ ధర కూడా బ్యారెల్‌కు 3 డాలర్లు పెరిగి $72.75 డాలర్లకు చేరుకుంది.

బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులపై ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. అయితే అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఐరోపాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి. 

ప్రముఖ మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.65, డీజిల్ ధర రూ. 89.82
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27 
- చెన్నై పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24, 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76

- ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 96.26, డీజిల్ ధర లీటరుకు రూ. 89.45.
– గురుగ్రామ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.96.97, డీజిల్ ధర రూ.89.84గా ఉంది.
– జైపూర్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.46, డీజిల్‌ ధర రూ.94.61గా ఉంది.

భోపాల్

పెట్రోలు: లీటరు ధర   రూ. 108.65

డీజిల్: లీటరు ధర   రూ. 93.90

హైదరాబాద్

పెట్రోలు: లీటరు ధర   రూ. 109.66

డీజిల్: లీటరు ధర   రూ. 97.82

బెంగళూరు

పెట్రోలు: లీటరు ధర   రూ. 101.94

డీజిల్: లీటరు ధర   రూ. 87.89

గౌహతి

పెట్రోలు: లీటరు ధర   రూ. 96.01

డీజిల్: లీటరు ధర   రూ. 83.94

లక్నో

పెట్రోలు: లీటరు ధర   రూ. 96.57

డీజిల్: లీటరు ధర   రూ. 89.76

చండీగఢ్

పెట్రోలు: లీటరు ధర  రూ. 96.20

డీజిల్: లీటరు ధర  రూ. 84.26

పాట్నా

పెట్రోలు: లీటరు ధర  రూ. 107.24

డీజిల్: లీటరు ధర   రూ. 94.04

 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

click me!