ట్విట్టర్ పోల్స్‌లో పాల్గొనాలంటే వెరిఫైడ్ అకౌంట్స్ ఉండాల్సిందే.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన..

By Sumanth Kanukula  |  First Published Mar 28, 2023, 10:13 AM IST

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ పోల్స్‌లో పాల్గొనాలని చూస్తున్నట్లయితే.. యూజర్లు వెరిఫైడ్ అకౌంట్లను కలిగి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.


సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ పోల్స్‌లో పాల్గొనాలని చూస్తున్నట్లయితే.. యూజర్లు వెరిఫైడ్ అకౌంట్లను కలిగి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఏప్రిల్ 15 నుంచి ట్విట్టర్ పోల్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదని తెలిపారు. అలాగే ‘‘ఫర్‌ యూ’’ సిఫార్సుల్లో కూడా.. వెరిఫైడ్ అకౌంట్స్ మాత్రమే అర్హత పొందుతాయని చెప్పారు. ఈ మేరకు ఎలన్ మస్క్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. 

“ఏప్రిల్ 15వ తేదీ నుండి.. వెరిఫైడ్ అకౌంట్స్ ఖాతాలు మాత్రమే ఫర్ యూ రికమండేషన్‌లో ఉండటానికి అర్హత పొందుతాయి. ఇది ఏఐ చాట్ బాట్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించగలిగే ఏకైక వాస్తవిక మార్గం. లేకుంటే అది నిస్సహాయ ఓడిపోయే యుద్ధం. పోల్స్‌లో ఓటింగ్‌కు అదే కారణంతో వెరిఫికేషన్ అవసరం’’ అని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.

Latest Videos

undefined

 

Starting April 15th, only verified accounts will be eligible to be in For You recommendations.

The is the only realistic way to address advanced AI bot swarms taking over. It is otherwise a hopeless losing battle.

Voting in polls will require verification for same reason.

— Elon Musk (@elonmusk)

ఇక, బిలియనీర్ ఎలన్ మస్క్ 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత కంపెనీలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్‌పై చెల్లింపు మొదలైన వాటితో సహా అనేక మార్పులు చేసాడు. ఈ మార్పుల కారణంగా పెద్ద సంఖ్యలో కంపెనీలు ట్విట్టర్‌లో ప్రకటనలను నిలిపివేశాయి. అయితే మస్క్ ప్రయత్నాల తర్వాత కొన్ని కంపెనీలు మళ్లీ ట్విట్టర్‌లో ప్రకటనలు చేయడం ప్రారంభించాయి. ఎలన్ మస్క్ ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీస్ విషయం.. ఏ వ్యక్తి లేదా ఏదైనా కంపెనీ కూడా డబ్బు చెల్లించడం ద్వారా వారి ఖాతాను ధృవీకరించవచ్చని చెప్పారు. అలాగే వివిధ వర్గాల కోసం వేర్వేరు రంగుల ధృవీకరించబడిన బ్యాడ్జ్‌లను కూడా ప్రవేశపెట్టారు. చాలా దేశాల్లో డబ్బులు చెల్లించి బ్లూ టిక్స్ తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. 
 

click me!