నేడు ఇంధన ధరలు ఇవే.. ప్రముఖ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ఒక లీటరు ధర ఎంతంటే ?

By asianet news teluguFirst Published Apr 29, 2023, 10:13 AM IST
Highlights

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రోజు క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. 12:24 pm EDT (1624 GMT)కి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.16 డాలర్లు లేదా 1.5 శాతం పెరిగి బ్యారెల్ $79.53 డాలర్లకి  చేరుకుంది, అయితే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ $1.99 డాలర్లు లేదా 2.7 శాతం పెరిగి $76.75 డాలర్లకి చేరుకుంది.

ఒక నివేదిక  ప్రకారం, నేడు శనివారం భారతీయ ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి . దేశ రాజధానిలో ఢిల్లీలో  పెట్రోల్ ధర రూ.96.72 , డీజిల్ ధర లీటరుకు రూ. 89.62గా  ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ. 94.27 వద్ద ఉన్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రోజు క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. 12:24 pm EDT (1624 GMT)కి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.16 డాలర్లు లేదా 1.5 శాతం పెరిగి బ్యారెల్ $79.53 డాలర్లకి  చేరుకుంది, అయితే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ $1.99 డాలర్లు లేదా 2.7 శాతం పెరిగి $76.75 డాలర్లకి చేరుకుంది.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తాజా ఇంధన ధరలు విడుదల చేయబడతాయి. జూన్ 2017కి ముందు, ఇంధన ధరలలో సవరణ ప్రతి 15 రోజులకు ఉండేది. రాష్ట్ర స్థాయి పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 

నోయిడాలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 96.76, డీజిల్ ధర రూ.89.76. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.79, డీజిల్ ధర లీటరుకు రూ.89.79గా ఉంది. లక్నోలో పెట్రోల్‌ ధర  లీటర్‌కు రూ.96.48, డీజిల్‌ ధర లీటరుకు రూ.89.76గా  ఉంది. హైదరాబాద్ లో ఒక లీటరు పెట్రోల్ ధర రూ.109.66, ఒక లీటరు డీజిల్ ధర     రూ.97.82

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి.

click me!