petrol diesel price:నేడు స్థిరంగా ఇంధన ధరలు.. మీ నగరంలో ప్రస్తుతం లీటరు ధర ఎంతో తెలుసుకోండి ?

By asianet news teluguFirst Published Dec 10, 2021, 12:00 PM IST
Highlights

నేడు శుక్రవారం ఉదయం చమురు కంపెనీలు(oil companies) ఇంధన ధర(fuel price)లో ఎటువంటి మార్పు లేదు. అలాగే గత నెల రోజులుగా  పెట్రోల్-డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగుతున్నాయి.

బెంగళూరు: ఢిల్లీ మినహా దేశంలోని ప్రధాన నగరాల్లో గత నెల రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత నవంబర్ 4 నుంచి పెట్రోలు(petrol), డీజిల్ (diesel)ధరలు అత్యధిక స్థాయి నుండి తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ని కూడా తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఇటీవల వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీలో ఇంధనం ధర లీటరుకు దాదాపు రూ.8 తగ్గింది. అయితే చాలా రాష్ట్రాల్లో  ఇప్పటికీ పెట్రోలు ధర రూ.100 పైగానే ఉంది.  కరోనా వైరస్(corona virus) ఓమిక్రాన్(omicron)  కొత్త వేరియంట్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్షీణత ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువన చేరింది. 
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు  స్థిరంగా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.109.98, డీజిల్ రూ.94.14గా ఉంది.  కోల్‌కతాలో   ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 104.76, డీజిల్ ధర రూ. 101.56. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.40, డీజిల్  ధర రూ.91.43కు విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక లీటర్ పెట్రోల్‌కు రూ.111.61, డీజిల్‌కు రూ.107.23గా ఉంది.

బెంగళూరులో పెట్రోల్ ధర రూ.100.58కి, డీజిల్ ధర రూ.85.01కి విక్రయిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ రూ.105.92కు, డీజిల్ రూ.91.09గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర  రూ.108.20, డీజిల్ ధర  రూ.94.62గా ఉంది. సాంస్కృతిక నగరమైన మైసూర్‌లో మైసూర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.100.32గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.84.77గా ఉంది.  

పెట్రో ధరల సవరణ ఎలా?
పెట్రోల్, డీజిల్ ధరలలో చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. మొదటిది ముడి చమురు(crude oil) ధర, రెండోది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు. డీలర్స్ కమీషన్ అలాగే వ్యాట్ (VAT)కూడా ధరలపై ప్రభావితం చూపుతుంది. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధిస్తాయి. దీని ప్రకారం ఇంధన ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  

click me!