వాహనదారులకు గుడ్ న్యూస్.. 24 రోజుల తరువాత దిగోచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు..

By S Ashok KumarFirst Published Mar 24, 2021, 10:24 AM IST
Highlights

గత కొంతకాలంగా స్థిరంగ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఫిబ్రవరి చివరి వారంలో ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోగా మరికొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 పైగా చేరింది. 

వాహనదారులకు  చుక్కలు చూపించిన ఇంధన ధరలు నేడు దిగోచ్చాయి. గత కొంతకాలంగా స్థిరంగ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఫిబ్రవరి చివరి వారంలో ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోగా మరికొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 పైగా చేరింది. 

నేడు రాష్ట్ర చమురు కంపెనీలు 24 రోజుల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. దీంతో  డీజిల్  పై 17 పైసలు,పెట్రోల్ పై 18 పైసలు తగ్గాయి. దేశ రాజధాని  ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.90.99, డీజిల్ ధర లీటరుకు రూ.81.30 దిగోచ్చింది. ముంబైలో పెట్రోల్ ధర రూ .97.40, డీజిల్ ధర లీటరుకు రూ.88.42 చేరింది.  


దేశంలోని ప్రముక్గ నగరాలలో ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి.

also read ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఆర్‌బి‌ఐ హాలీ డేస్ లిస్ట్ కోసం ఇక్కడ చూడండి...
  
నగరం              డీజిల్    పెట్రోల్
ఢీల్లీ                  81.30    90.99
కోల్‌కతా            84.18    91.18
ముంబై             88.42    97.40
చెన్నై               86.29    92.95
హైదరాబాద్‌     84.18   91.18
 

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 నుండి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర వస్తువులను జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఫిబ్రవరి 27 న  పెట్రోలు ధర దేశ రాజధానిలో 91.17 వద్ద ఆల్ టైమ్ హైని తాకిన సంగతి తెలిసిందే.  కాగా ముడి చమురు ధరలు దాదాపు రెండు వారాల నుంచి సుమారు 10 శాతం తగ్గాయి.  బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 27 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగి బ్యారెల్ కు 61.06 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.95 డాలర్లకు చేరుకుంది.

 మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మీరు ఆర్‌ఎస్‌పి ఇంకా మీ సిటీ కోడ్‌ను వ్రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

click me!