ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఆర్‌బి‌ఐ హాలీ డేస్ లిస్ట్ కోసం ఇక్కడ చూడండి..

By S Ashok KumarFirst Published Mar 23, 2021, 7:48 PM IST
Highlights

భారతదేశంలోని అన్నీ బ్యాంకులు ఏప్రిల్ నెలలో 14 రోజులు మూతపడనున్నాయి. ఈ 14 రోజులలో ఎనిమిది  వివిధ పండుగ సెలవులు,  ఏప్రిల్ 1 బ్యాంక్స్ క్లోసింగ్ డే ఉన్నాయి. మిగిలినవి నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో సహా సాధారణ సెలవులు కూడా ఉన్నాయి. 

న్యూ ఢీల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) క్యాలెండర్ ప్రకారం భారతదేశంలోని అన్నీ బ్యాంకులు ఏప్రిల్ నెలలో 14 రోజులు మూతపడనున్నాయి. ఈ 14 రోజులలో ఎనిమిది  వివిధ పండుగ సెలవులు,  ఏప్రిల్ 1 బ్యాంక్స్ క్లోసింగ్ డే ఉన్నాయి. మిగిలినవి నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో సహా సాధారణ సెలవులు కూడా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే అని గుర్తుంచుకోవాలి.  ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6  సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి.  

నాల్గవ శనివారం, హోలీ కారణంగా మార్చి 27-29 వరకు బ్యాంకులు కూడా మూసివేయబడతాయి. మార్చి 31న బ్యాంక్ శాఖలు తెరిచి ఉంటాయి. కానీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు  కాబట్టి వినియోగదారులకు  బ్యాంక్ సౌకర్యాలు లభించనందున సాధారణ వ్యాపారం జరగదు.

మార్చి 27 నుండి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 2 పని దినాలు మాత్రమే ఉన్నాయి. ఆర్‌బిఐ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం, భారతదేశం అంతటా రెండవ శనివారం, హోలీ పండుగ సందర్భంగా మార్చి 27 నుండి 29 వరకు మూడు రోజులు పాటు  బ్యాంకులు వరుసగా మూసివేయబడతాయి.

also read 

పాట్నాలో మార్చి 30న బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే పాట్నాలోని బ్యాంకులకు రెండు రోజుల హోలీ సెలవు లభిస్తుంది. అంటే పాట్నాలోని బ్యాంకు శాఖలు వరుసగా నాలుగు రోజులు మూసివేయబడతాయి.


ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు:

ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4: ఆదివారం
ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
ఏప్రిల్ 10: రెండవ శనివారం
ఏప్రిల్ 11: ఆదివారం
ఏప్రిల్ 13: ఉగాది పండుగ
ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 
ఏప్రిల్ 18: ఆదివారం
ఏప్రిల్ 21: శ్రీరామ నవమి
ఏప్రిల్ 24: నాల్గవ శనివారం
ఏప్రిల్ 25: ఆదివారం

బ్యాంక్ సెలవుదినాలు వివిధ రాష్ట్రాలు బట్టి  మారుతుండొచ్చు. అందువల్ల ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా రాష్ట్రం ప్రకారం మారవచ్చు, బ్యాంక్ సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా పాటించవు. గెజిటెడ్ సెలవులను మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంకులు పాటిస్తాయి.

ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 16 వరకు గౌహతిలోని బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూసివేయబడతాయి. పాట్నా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు మార్చి 30 నుండి ఏప్రిల్ 2 వరకు వరుసగా నాలుగు రోజులు పనిచేయవు. బ్యాంక్ వినియోగదారులు సెలవు తేదీలను బట్టి వారి బ్యాంక్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

click me!