స్టాక్ మార్కెట్ ఢమల్ : నేడు నష్టాలతో ముగింపు.. మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లకు వరుస నష్టాలు..

By asianet news teluguFirst Published Jun 17, 2021, 6:02 PM IST
Highlights

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ముగిసాయి.  సెన్సెక్స్‌ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద ముగియగా , నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 15,691 వద్ద ముగిసింది. 

నేడు వారంలో 4వ ట్రేడింగ్ రోజున గురువారం స్టాక్ మార్కెట్ నష్టలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 178.65 పాయింట్లు (0.34 శాతం) తగ్గి 52,323.33 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 76.15 పాయింట్లు (0.48 శాతం) క్షీణించి 15,691.40 వద్ద ముగిసింది. గత వారం 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 374.71 పాయింట్లతో  0.71 శాతం పెరిగింది. 

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుస లాభాలకు చెక్‌ పెడుతూ బుధవారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్‌ గురువారం కూడా అదే బాటలో పయనించింది. ఆరంభంలోనే భారీ నష్టాలను చూసింది. కీలక సూచీలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్‌ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల  షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

ఒక దశలో 400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ మిడ్‌ సెషన్‌ తరువాత పుంజుకున్నా, చివరికి 52400 దిగువన ముగిసింది. నిఫ్టీ కూడా అదే దోరణిని కొనసాగించి 15700 దిగువనే  ముగిసింది. సెన్సెక్స్‌ 179 పాయింట్లు క్షీణించి 52323 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 15691 వద్ద స్థిరపడింది.

 హెవీవెయిట్‌లలో ఎక్కువ భాగం
నేడు అల్ట్రాటెక్ సిమెంట్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభలతో  ట్రేడయ్యాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, హిండాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టిపిసి, ఇట్చర్ మోటార్స్ షేర్లు నష్టాలతో  ముగిశాయి. 

also read 

సెక్టోరియల్ ఇండెక్స్ పరిశీలిస్తే
 ఈ రోజు ఐటి అండ్ ఎఫ్‌ఎంసిజి మినహా అన్ని రంగాలు నష్టాలతో ముగిశాయి. వీటిలో పిఎస్‌యు బ్యాంకులు, ఫార్మా, లోహాలు, ఆటో, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ, మీడియా ఉన్నాయి. 

గత వారం టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో 5 మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,389.44 కోట్లకు పెరిగింది. ఐటి రంగ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్ అత్యధిక లాభాలను ఆర్జించాయి. సమీక్షించిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగినప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది.

నష్టలతో ప్రారంభం
నేడు ఉదయం సెన్సెక్స్ 282.82 పాయింట్లు (0.54 శాతం) తగ్గి 52,219.16 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 89.30 పాయింట్లు (0.57 శాతం) క్షీణతతో 15,678.20 వద్ద ప్రారంభమైంది. 

సెన్సెక్స్-నిఫ్టీ బుధవారం కూడా నష్టాలతో ముగిసింది 
స్టాక్ మార్కెట్ బుధవారం నష్టలతో  ముగిసింది. సెన్సెక్స్ 271.07 పాయింట్లు (0.51 శాతం) తగ్గి 52,501.98 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 101.70 పాయింట్లు లేదా 0.64 శాతం క్షీణించి 15,767.55 వద్ద ముగిసింది.

click me!