ఆగస్టు డెలివరీకి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0013 GMT నాటికి బ్యారెల్‌కు 11 సెంట్లు పెరిగి $73.82కి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) బ్యారెల్‌కు 8 సెంట్లు పెరిగి $69.54కి చేరుకుంది.
నేడు మే 31న భారతదేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను ఉదయం 6 గంటలకు ప్రకటిస్తారు. అయితే వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.
ఈ రోజు మహారాష్ట్రలో పెట్రోలు ధర 80 పైసలు, డీజిల్ ధర 77 పైసలు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 40 పైసలు పెరిగింది. ఇది కాకుండా, రాజస్థాన్, జార్ఖండ్ ఇంకా జమ్మూ కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ధరలు పెరిగాయి. మరోవైపు గుజరాత్‌లో పెట్రోల్ 41 పైసలు, డీజిల్ 42 పైసలు తగ్గాయి. మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 30 పైసలు తగ్గింది. మెట్రో నగారాల గురించి మాట్లాడితే చెన్నైలో పెట్రోల్ డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది.
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
ఆగస్టు డెలివరీకి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0013 GMT నాటికి బ్యారెల్‌కు 11 సెంట్లు పెరిగి $73.82కి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) బ్యారెల్‌కు 8 సెంట్లు పెరిగి $69.54కి చేరుకుంది.
బెంగళూరు: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర : రూ. 87.89
చండీగఢ్: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర: రూ. 84.26
గురుగ్రామ్: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91
లక్నో: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76
నోయిడా: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82
హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66. డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.
భారతదేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇంకా రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.