బంగారం, వెండి కొనేవారికి మంచి ఛాన్స్.. నేడు నిలకడగా ధరలు.. 22 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

By asianet news telugu  |  First Published May 30, 2023, 11:04 AM IST

ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,600. 


ఈ రోజు 30 మే 2023న ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా ఇంకా ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,650, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.110 పతనంతో 60,750 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గడంతో రూ. 55,900గా ఉన్నాయి.  24 క్యారెట్ల బంగారం ధర  రూ. 60 పతనంతో  రూ. 60,980గా ఉంది.

 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,600. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 60,600. వెండి ధరలు చూస్తే కోల్‌కతా, ముంబైలో కేజీ ధర  రూ.73,000, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 77,000

Latest Videos

 ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

 మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 

 ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,600. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,600.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,600. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,600.

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 77,000.

 2021-22లో పపసిడి  దిగుమతులు USD 46.2 బిలియన్లుగా ఉన్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 6.12 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

2022-23లో సరుకుల వాణిజ్య లోటు(merchandise trade) USD 191 బిలియన్‌ల నుండి 267 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.

భారతదేశం బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం, ఇది ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను అందిస్తుంది. పరిమాణం పరంగా, దేశం ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.

2022-23లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 3 శాతం క్షీణించి 38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.

click me!