దిగిరాని ఇంధన ధరలు.. ఏడాది గడుస్తున్నా స్థిరంగా పెట్రోల్, డీజిల్.. మీ నగరంలో లీటరు ధర ఎంతంటే..

By asianet news telugu  |  First Published Aug 21, 2023, 10:18 AM IST

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. 


నేడు  ఆగస్టు 21 సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా  చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. అయితే, ఒక్కొక్క నగరాలలో  ప్రతిరోజూ ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా కొన్ని పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి.

Latest Videos

ఈ నెల ప్రారంభంలో  పెట్రోల్, డీజిల్‌పై  పన్నులు విధించడం ద్వారా కేంద్రం లబ్ధి పొందుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జ్, కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ హిందీలో మాట్లాడుతూ, గత యుపిఎ ప్రభుత్వ హయాంలో పన్ను స్థాయిల లాగానే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25-30 తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగించే సామర్థ్యం కేంద్రానికి ఉందని అన్నారు. 

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో, పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. ఇదిలా ఉండగా, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24. 

ఇతర నగరాల్లో ఇంధన ధరలను ఇక్కడ చూడండి:

 బెంగళూరు:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర: రూ. 87.89
చండీగఢ్:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 98.65, డీజిల్ ధర: రూ. 88.95
 గురుగ్రామ్:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91
 లక్నో:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76
 నోయిడా:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)   అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా  ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోల్ డీజిల్ ధరలను సవరిస్తాయి. పెట్రోల్ డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు  ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. 

click me!