Petrol and Diesel Rate: సామాన్యులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతున్నాయో తెలిస్తే పండగే..

By Krishna Adithya  |  First Published Jun 23, 2023, 6:25 PM IST

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గనున్న నేపథ్యంలో మార్కెటింగ్ కంపెనీలు సైతం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ మేర తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


పెట్రో ధరల పెరుగుదలతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి భారాన్ని తగ్గించాయి. ఇప్పుడు సామాన్యులకు మరో శుభవార్త వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.4 నుంచి రూ.5 తగ్గిస్తూ ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. 

ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువగా ఉంది, కాబట్టి చమురు మార్కెటింగ్ కంపెనీ ధరను తగ్గించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. త్వరలోనే తుది ముద్ర వేయనున్నారు. ముడి చమురు ధరలు ఇప్పటికే భారీగా పడిపోయాయి. దీంతో చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 6.8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 50 పైసలు లాభపడుతున్నాయి. తద్వారా ఆగస్టు నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధర తగ్గనుంది.

Latest Videos

గతేడాది ముడి చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్లు. ఇప్పుడు అది 76 నుంచి 80 డాలర్లకు తగ్గింది. ముడి చమురు ధర పెరిగినప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ. 17.4, డీజిల్‌పై రూ.27.7. నష్టాన్ని చవిచూసింది. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. దాదాపు ఏడాది కాలంగా రోజువారీగా పెట్రోలు, డీజిల్ ధరలను సవరించలేదు. అయితే ఈ కంపెనీలు ఆగస్టు నెల నుంచి ధరలను తగ్గించాలని నిర్ణయించాయి.

ఇటీవల క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ.. ధర తగ్గకపోవడానికి గల కారణాలను కూడా అధికారులు చెబుతున్నారు. గతేడాది ముడిచమురు ధర ఇంధన విక్రయ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ కంపెనీలు ధరను పెంచలేదు. కాబట్టి ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ధరల సవరణ జరగలేదని తెలిపారు. ఇందులో మూడు కంపెనీలు ఇప్పటికే పెట్రోలు విక్రయాల్లో లాభపడుతున్నాయి. అయితే డీజిల్ అమ్మకాల్లో భారీ నష్టాన్ని చవిచూసి ఇప్పుడు లాభమూ, నష్టమూ లేని స్థితికి వచ్చారు. తద్వారా గతంలో వచ్చిన డీజిల్ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రస్తుత లాభాలను ఉపయోగించుకుంటున్నారు. ధర మరింత స్థిరంగా ఉంటే, భవిష్యత్తులో ధరను సవరించవచ్చు' అని అధికారులు తెలిపారు. 

క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, మరోవైపు ఇంతకాలం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్,సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో పాటు రాబోయే లోక్ సభ ఎన్నికల కారణంగా  పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

click me!