
మార్చి 11, శుక్రవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు విడుదలయ్యాయి. నేడు దేశంలోని అనేక నగరాల్లో ఇంధన ధరలు స్వల్పంగా మారాయి. కొన్ని నగరాల్లో ఇంధన ధరలు తగ్గాయి, కొన్ని నగరాల్లో చమురు ధరలు పెరిగాయి.
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 108.20, డీజిల్ ధర రూ. లీటరుకు 94.62గా నమోదైంది. మరోవైపు ముడిచమురు ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. కేవలం రెండు రోజుల క్రితం అంటే మార్చి 9, 2022న అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లను దాటింది. అయితే నేడు మార్చి 11న అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 108 డాలర్లకు పడిపోయింది.
క్రూడాయిల్ ధరలు పతనం
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో అస్థిరతను చోటు చేసుకుంది. ఒక దశలో బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరి, ప్రస్తుతం ముడి చమురు ధరలు బ్యారల్ కు 20 డాలర్ల చొప్పున పైగా పడిపోయాయి. oilprice.com నుండి అందిన సమాచారం ప్రకారం, మార్చి 11 న, WTI క్రూడ్ ధర 105.6 డాలర్ల కు తగ్గింది, మరోవైపు, బ్రెంట్ క్రూడ్ ధర కూడా బ్యారెల్కు 108.30 డాలర్లకు పడిపోయింది.
దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ, ప్రస్తుతం దేశంలోని అన్ని నగరాల్లోనూ పెట్రోలు, డీజిల్ ధరలు అంచనా వేసినట్లు ఇంకా పెరిగిన దాఖలాలు కనిపించడం లేదు. మార్చి 10న అన్ని రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు లీటరుకు రూ.12 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.