భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ...లీటర్ పెట్రోల్ ఎంతంటే...?

Ashok Kumar   | Asianet News
Published : Feb 08, 2020, 03:26 PM IST
భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ...లీటర్ పెట్రోల్ ఎంతంటే...?

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడవ రోజు  కూడా తగ్గింది. ఒక్క  ఫిబ్రవరి నెలలోనే పెట్రోల్ పై లీటరుకు 82 పైసలు, డీజిల్ పై లీటరుకు 85 పైసలు తగ్గింది.   

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోల్ ధరపై 24 పైసలు డీజిల్ ధరపై 27 పైసలు తగ్గించారు. ఢిల్లీలో నగరంలో పెట్రోల్ లీటరుకు 72.45 కు అమ్ముడవుతోంది. ముంబైలో పెట్రోల్ ఇప్పుడు లీటరుకు రూ.78.11 ఉంది.

కోల్‌కతాలో లీటరు పెట్రోల్  ధర రూ.75.13 వద్ద లభిస్తుంది. చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 75.27 ఉంది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.65.43 ఉండగా, ముంబైలో  లీటర్ డీజిల్‌ ధర రూ.68.57 చెల్లించాలి. కోల్‌కతాలో లీటరు డీజిల్‌ ధర రూ. 67.79 కు విక్రయిస్తున్నారు.

also read ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాటేస్తున్న కరోనా వైరస్‌...ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ వెల్లడి

చెన్నైలో డీజిల్‌ లీటర్ ధర 69.10 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఒక్క  ఫిబ్రవరి నెలలోనే పెట్రోల్ పై లీటరుకు 82 పైసలు, డీజిల్ పై లీటరుకు 85 పైసలు తగ్గింది. కరోనా వైరస్‌ ప్రకంపనలు ముడిచమురు ధరలను కూడా తాకాయి.

చమురుకు డిమాండ్‌ ఎక్కువుండే చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తితో చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర గత వారం పడిపోయింది. వారంలో వరుసగా ఐదవ క్షీణతను నమోదు చేసింది. 

also read కరోనా వైరస్ దెబ్బతో ఐఫోన్ల తయారీ ఆపేసి మాస్కులు తయారు చేస్తున్నారు...

ఇతర పెద్ద ఉత్పత్తిదారులు కోరిన ఉత్పత్తిని తగ్గించడానికి ముందు ఎక్కువ సమయం అవసరమని రష్యా చెప్పడంతో అంతర్జాతీయ ముడి చమురు ధర గత వారం పడిపోయింది. చమురు ధరలు వారానికి వరుసగా ఐదవ క్షీణతను నమోదు చేశాయి. బ్రెంట్ ముడి బ్యారెల్కు 54.50 వద్ద ట్రేడవుతోంది.

ఇంధన రిటైల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-యుఎస్ డాలర్ మారకపు రేటుపై ఆధారపడి ఉంటాయి. దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ సమీక్షిస్తాయి.

PREV
click me!

Recommended Stories

Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు
Amazon Jobs : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు... అమెజాన్ లో 10 లక్షల జాబ్స్..!