ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం వాడుతున్నారా అయితే జాగ్రత్త.. క్యాష్ విత్‌డ్రా చేసేటప్పుడు..

By Sandra Ashok KumarFirst Published Aug 19, 2020, 6:54 PM IST
Highlights

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ప్రకారం మెట్రో నగరాల్లో ఎస్‌బిఐ  సాధారణ సేవింగ్స్ అక్కౌంట్ ఖాతాదారులకు ఒక నెలలో 8 ఉచిత లావాదేవీలను చేయడానికి అనుమతిస్తుంది.

భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) జూలై 1 నుండి ఎటిఎం విత్ డ్రా నిబంధనలను సవరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ప్రకారం మెట్రో నగరాల్లో ఎస్‌బిఐ  సాధారణ సేవింగ్స్ అక్కౌంట్ ఖాతాదారులకు ఒక నెలలో 8 ఉచిత లావాదేవీలను చేయడానికి అనుమతిస్తుంది.

ఆరు మెట్రో నగరాల్లో  (ముంబై, న్యూ ఢీల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు మరియు హైదరాబాద్) ఉండే వారికి ఎస్‌బి‌ఐ ఎటిఎంలలో సేవింగ్స్ అక్కౌంట్ ఖాతాదారులకు ఐదు ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకు ఎటిఎంలలో మూడు ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది.

నాన్-మెట్రో నగరాలలో ఉండే వినియోగదారులకు 10 ఉచిత ఎటిఎం లావాదేవీలను అందిస్తుంది, ఇందులో 5 లావాదేవీలు ఎస్‌బి‌ఐ నుండి, 5 ఇతర బ్యాంకుల ఎటిఎం నుండి చేసుకోవచ్చు.

సేవింగ్స్ అక్కౌంట్ ఖాతాలో సగటున 1 లక్ష రూపాయల బ్యాలెన్స్‌ కంటే ఎక్కువ  మెయిన్ టైన్ చేయడం ద్వారా వినియోగదారులకు ఎస్‌బిజి(స్టేట్ బ్యాంక్ గ్రూప్) ఎటిఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఎటిఎంలలో ఆన్ లీమిటెడ్ లావాదేవీలు చేసుకోవచ్చు.

నిర్ణీత పరిమితికి మించిన అదనపు ఆర్థిక లావాదేవీల కోసం ఎస్‌బి‌ఐ రూ.10 ప్లస్ జిఎస్టి నుండి రూ .20 ప్లస్ జిఎస్టి వరకు ఛార్జీలు విధిస్తుంది.

also read 

ఏ‌టి‌ఎం ఫెల్డ్ ట్రాన్సాక్షన్స్ 
ఒకవేళ ఏ‌టి‌ఎంలో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే, తగినంత బ్యాలెన్స్ లేకపోయిన బ్యాంక్ రూ.20 తో పాటు జీఎస్టీ  చార్జ్ వసూలు చేస్తుంది.

ఎస్‌బి‌ఐ ఓటిపి ఆధారిత  క్యాష్ విత్ డ్రా
అన్ని ఎస్‌బి‌ఐ ఎటిఎంలలో రూ.10,000 కంటే ఎక్కువ నగదును ఉపసంహరించుకోవడానికి ఎస్‌బి‌ఐ  సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. 2020 జనవరి 1న ప్రవేశపెట్టిన ఈ కొత్త సదుపాయం, ఎటిఎం కార్డుదారులకు అన్ని ఎస్‌బిఐ ఎటిఎంలలో రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఒటిపి) సహాయంతో నగదు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది.  

"మా ఒటిపి ఆధారిత  క్యాష్ విత్ డ్రా  సిస్టం ఎస్‌బి‌ఐ ఎటిఎంలలో లావాదేవీలను మరింత సురక్షితం చేస్తుంది. ఏ‌టి‌ఎం మోసాల నుండి మిమ్మల్ని రక్షించడం ఎల్లప్పుడూ మా బాద్యత" అని ఎస్‌బి‌ఐ ట్వీట్ చేసింది.

click me!