పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు : 11 మంది ఆర్‌ఎస్ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత..

By SumaBala Bukka  |  First Published Jan 30, 2024, 3:50 PM IST

బడ్జెట్ సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో, ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం వివిధ రాజకీయ పార్టీల నేతలకు హామీ ఇచ్చింది.


ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు, మంగళవారం 11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేశారు. డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ ఉల్లంఘనపై చర్చకు డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెండ్ చేశారు.

“అన్ని సస్పెన్షన్లు రద్దు చేయబడతాయి. నేను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌తో మాట్లాడాను. ప్రభుత్వం తరపున వారిని కూడా అభ్యర్థించాను” అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బడ్జెట్ సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశం తరువాత వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ తెలిపారు. “ఇది స్పీకర్, చైర్మన్ అధికార పరిధి. కాబట్టి సంబంధిత ప్రివిలేజ్డ్ కమిటీలతో మాట్లాడి సస్పెన్షన్‌ను రద్దు చేసి సభకు వచ్చే అవకాశం ఇవ్వాలని వారిద్దరినీ కోరాం. ఇద్దరూ అంగీకరించారు” అన్నారు.

Latest Videos

undefined

నిర్మలా సీతారామన్ నెల జీతం ఎంతో తెలుసా?

అఖిలపక్ష సమావేశంలో, ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం వివిధ రాజకీయ పార్టీల నేతలకు హామీ ఇచ్చిందని పీటీఐ నివేదించింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి, లోక్‌సభలో ఉపనేత రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషి, ఆయన డిప్యూటీ అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. ఇదిలావుండగా, కాంగ్రెస్‌కు చెందిన కె.సురేష్, టిఎంసికి చెందిన సుదీప్ బందోపాధ్యాయ, డిఎంకెకు చెందిన టిఆర్ బాలు, శివసేనకు చెందిన రాహుల్ షెవాలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎస్‌టి హసన్, జెడి(యు) రామ్‌నాథ్ ఠాకూర్, టిడిపికి చెందిన జయదేవ్ గల్లా పార్లమెంటు సమావేశానికి హాజరయ్యారు. 

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ, అస్సాంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రపై "హింసాత్మక దాడి" అంశాన్ని లేవనెత్తారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన ఆయన, దేశంలో "అలిఖిత నియంతృత్వం" నెలకొందని అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాలు జనవరి 31- ఫిబ్రవరి 9 మధ్య జరుగుతాయి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

click me!