ఆర్థిక మంత్రి పదవీకాలం సాధారణంగా పాలక ప్రభుత్వ పదవీకాలంతో సమానంగా ఉంటుంది. ఆమె తన పదవీకాలంకంటే ముందుగానే రాజీనామా చేస్తే లేదా ముందుగా భర్తీ చేయకపోతే దీంట్లో మార్పులు ఉండొచ్చు.
నిర్మలా సీతారామన్ మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రిగా రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ తో ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మంత్రిగా రికార్డ్ సృష్టించబోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి దేశం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రికి జీతం ఎంతుంటుందో అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పథకాలు, బడ్జెటింగ్ చేసే మంత్రి జీతం ఎంతుంటుందో ఎలా తెలుస్తుంది? అంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ఉద్యోగి కిందికే వస్తారు.ప్రభుత్వ అధికారిగా, ఆమె జీతం బహిరంగంగా వెల్లడి చేస్తారు. అంతేకాదు ఆమె జీతం వివరాలు ఇప్పుడు ఉన్నవాటికంటే కాస్త అటూ, ఇటుగా కూడా ఉండొచ్చు. కారణం.. పదవీకాలంలో కొంత హైక్ అయ్యే అవకాశం ఉండడమే.
బడ్జెట్ 2024 : మధ్యతరగతి వారికి ఏ లాభాలుండబోతున్నాయి?
2019లో వెలువడిన డేటా ప్రకారం.. భారత ప్రభుత్వం జీతం, అలవెన్సులు, పార్లమెంటు సభ్యుల పెన్షన్ చట్టం, 1954 ప్రకారం, ఆర్థిక మంత్రి నెలవారీ జీతం సుమారుగా నెలకు రూ. 4,00,000 (4 లక్షలు) ఉంటుంది. ఇది నెలకు సుమారు 5,500అమెరికన్ డాలర్లకి సమానం.
ఆర్థిక మంత్రి పదవీకాలం సాధారణంగా పాలక ప్రభుత్వ పదవీకాలంతో సమానంగా ఉంటుంది. ఆమె తన పదవీకాలంకంటే ముందుగానే రాజీనామా చేస్తే లేదా ముందుగా భర్తీ చేయకపోతే దీంట్లో మార్పులు ఉండొచ్చు. భారత ప్రభుత్వ ప్రస్తుత పదవీకాలం మే 30, 2019న ప్రారంభమైంది. 2024, ఎన్నికలతరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ముగుస్తుంది.
ఇప్పటికైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా పూర్తి కాలం పనిచేశారు కాబట్టి, ఆమె పదవీ కాలంలో ఆమె మొత్తం జీతం సుమారుగా రూ. 1,92,00,000 అవుతుంది. (1 కోటి 92 లక్షలు). ఇది ప్రస్తుత మారకపు రేటు ప్రకారం సుమారు 260,000 అమెరికన్ డాలర్లకి సమానం. ఇది ముందుగా చెప్పుకున్న జీతంపై ఆధారపడి ఉందని, ఈ ఐదేళ్లలో ఏదైనా మార్పులు జరిగితే.. ఇందులో మరింత పెరుగుదల ఉండే అవకాశం ఉంది.