ఎయిర్ ఇండియా కొనేందుకు టాటా సన్స్ ప్రయత్నం..!

By telugu news teamFirst Published Sep 16, 2021, 7:56 AM IST
Highlights

స్పైస్ జెట్ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ వ్యక్తిగత హోదాలో ఆర్థిక బిడ్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్, స్పైస్ జెట్ అధిపతి అజయ్ సింగ్ లు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వీరు ఆర్థిక బిడ్ లను దాఖలు  చేయడం గమనార్హం. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉప సంహరణ లావాదేవీకి అనువుగా ఆర్థిక బిడ్ లు వచ్చాయని.. తుది దశకు ఈ ప్రక్రియను తీసుకువెళ్తామని దీపమ్ కార్యదర్శి  తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు.

ఎయిర్ ఇండియా కోసం పలు ఆర్థిక బిడ్ లు వచ్చినట్లు తెలిపినా.. ఎన్ని కంపెనీలు, ఏ కంపెనీలు రేసులో ఉన్నాయనేది మాత్రం వెల్లడించలేదు. టాటా సన్స్ ప్రతినిధి ఒకరు ఎయిర్ ఇండియా కోసం తమ గ్రూప్ బిడ్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే ఎయిరేషియా ఇండియా ద్వారానా లేదా సొంతంగా బిడ్ వేశారో స్పష్టం కాలేదు.

స్పైస్ జెట్ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ వ్యక్తిగత హోదాలో ఆర్థిక బిడ్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందే..

బయటకు వెల్లడించని రిజర్వ్ ధరపై ఆర్థిక బిడ్ లు దాఖలవుతాయి, ఆ ధర కంటే అత్యధికంగా వేసిన బిడ్ ను అంగీకరిస్తారు. దీనిని మంత్రివర్గ ఆమెదానికి సిఫారసు చేసే ముందు లావాదేవీ సలహా దారు దానిని పరిశీలిస్తారు.

ఎయిర్ ఇండియాలో వాటా విక్రయ ప్రక్రియను కేంద్రం జనవరి 2020 లో ప్రారంభించినా.. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏప్రిల్ 2021 లో ఆర్థిక బిడ్ లకు ఆహ్వానం పలికింది. సెప్టెంబర్ 15 అందుకు చివరి తేదీగా నిర్ణయించింది. డిసెంబర్ 2020లో  ఈ ఎయిర్ ఇండియాను కొనడానికి ముందుగా ఆసక్తి  చూపించించిన కొన్ని కంపెనీల్లో టాట కూడా ఉండటం గమనార్హం. 

click me!