New Guideline:ఇక సిగరెట్ ప్యాకెట్‌లపై ఇలా వ్రాసి ఉంటుంది.. కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

Published : Jul 22, 2022, 01:41 PM ISTUpdated : Jul 22, 2022, 01:42 PM IST
New Guideline:ఇక సిగరెట్ ప్యాకెట్‌లపై ఇలా వ్రాసి ఉంటుంది.. కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

సారాంశం

మైనర్‌లకు  పొగాకు లేదా పొగాకు పదార్థాలను విక్రయించడం అనేది బాలల న్యాయ చట్టం 2015లోని సెక్షన్ 77ను ఉల్లంఘించడమే. ఈ చట్టం ప్రకారం నిందితులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించే నిబంధన కూడా ఉంది.    

సిగరెట్‌లు, ఇతర పొగాకు పదార్థాల ప్యాకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం, ఇప్పుడు సిగరెట్ ఇతర ఉత్పత్తుల ప్యాకెట్లపై పొగాకు వినియోగం అంటే అకాల మరణం(premature death) అని పెద్ద అక్షరాలతో ముద్రించి ఉంటుంది. ఇంతకు ముందు పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్‌పై పొగాకు అంటే ప్రాణాంతకం( painful death) అని రాసి ఉండేది. 

ఈ సవరించిన నిబంధనలను ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జూలై 21న జారీ చేసింది. కొత్త నిబంధనలు 1 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వస్తాయి. అంతేకాకుండా ప్యాకెట్ వెనుక వైపు, నలుపుపై తెలుపు అక్షరాలతో ఈరోజే మానేయండి 1800-11-2356కు కాల్ చేయండి అని వ్రాసి ఉంటుంది,  

మైనర్‌లకు పొగాకు లేదా ఏదైనా పదార్థాన్ని విక్రయించడం అనేది బాలల న్యాయ చట్టం 2015లోని సెక్షన్ 77ను ఉల్లంఘించడమే. ఈ చట్టం ప్రకారం, నిందితులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. 

 ప్రతి సంవత్సరం 80 లక్షల మంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం 80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. పొగాకు వాడకాన్ని అరికట్టేందుకు ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పొగాకు ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తారు. 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే