ప్రముఖ ఆర్థికవేత్త, పద్మ భూషణ్ డాక్టర్ ఇషర్ జడ్జి అహ్లువాలియా మృతి..

By Sandra Ashok KumarFirst Published Sep 26, 2020, 5:12 PM IST
Highlights

డాక్టర్ ఇషర్ అహ్లువాలియా మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియాను వివాహం చేసుకున్నారు. విద్య, సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు 2009లో ఆమెకు పద్మ భూషణ్ అవార్డు లభించింది.  

న్యూ ఢీల్లీ: ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ ఇషర్ జడ్జి అహ్లువాలియా(74), మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ గ్రహీత ఈ రోజు మరణించారు.

డాక్టర్ ఇషర్ అహ్లువాలియా మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియాను వివాహం చేసుకున్నారు. విద్య, సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు 2009లో ఆమెకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఆమె ఢీల్లీకి చెందిన థింక్ ట్యాంక్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐ‌సి‌ఆర్‌ఐ‌ఈ‌ఆర్) కు చైర్ పర్సన్.

ఆమె మరణ వార్త తెలియగానే సోషల్ మీడియాలో చాలా మంది ఆమెకు నివాళులు అర్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆమెను "భారతదేశపు అత్యంత ప్రసిద్ధ ఆర్థికవేత్తలలో ఒకరు అని గుర్తు చేస్తూ  డాక్టర్ ఇషర్ జడ్జి అహ్లువాలియా మరణ వార్తా నాకు చాలా బాధగా కలిగించింది.

also read 

ఆమె భారతదేశపు అత్యంత విశిష్టమైన ఆర్థికవేత్తలలో ఒకరు.  నా చివరి టర్మ్ లో ఆమె రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా నియమించడం మాకు విశేషం. మాంటెక్ జి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను"అని ఆయన ట్వీట్ చేశారు.

"చాలా సంవత్సరాలుగా నాకు ప్రియమైన స్నేహితురాలు, ఆమే క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడిన మహిళా. మీరు లేని లోటు తీరనిది. బెటర్ వరల్డ్ కావాలని కలలుకంటున్న మహిళలందరికీ మీ జీవిత కథ ఒక ఇన్సిరేషన్." అంటూ భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నియుపమా మీనన్ రావు ట్వీట్ చేశారు.

డాక్టర్ అహ్లువాలియా "క్యాన్సర్‌తో  ధైర్యంగా చేసిన పోరాటం" గురించి గుర్తుచేసుకుంటూ బయోటెక్నాలజీ పరిశ్రమ సి‌ఈ‌ఓ కిరణ్ మజుందార్-షా విరిద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఇషర్ జడ్జి అహ్లువాలియా పద్మ భూషణ్ గ్రహీత మరణించినట్లు కిరణ్ మజుందార్-షా అన్నారు.

మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ట్వీట్ చేస్తూ "ఇషర్ అహ్లువాలియా ఇప్పుడే కన్నుమూశారు, భారతదేశంలోని విశిష్ట ఆర్థికవేత్తలలో ఆమె ఒకరు, ఎంఐటి పిహెచ్‌డి, 'ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా' పుస్తక రచయిత. ఆమె ఐ‌సి‌ఆర్‌ఐ‌ఈ‌ఆర్ ను నిర్మించింది, అంతే కాకుండా ఆమె ఒక మంచి ఆర్థిక థింక్ ట్యాంక్. మాంటెక్ భార్య కాకుండా ఆమెకు విలక్షణమైన గుర్తింపు ఉంది. " అన్నారు.
 

click me!