మరో ఆర్థిక నేరగాడు.. రూ.5000 కోట్లు ఎగనామం.. నైజీరియాకు చెక్కేసిన నితిన్ సందేసర

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 4:18 PM IST
Highlights

విజయ్ మాల్యా, నీరవ్ మోడీల కోవలో మరో ఆర్థిక నేరగాడు వెలుగులోకి వచ్చాడు.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన నితిన్ సందేసర ..తప్పుడు డాక్యుమెంట్లతో  పలు బ్యాంకుల నుంచి రూ.5000 కోట్లు సేకరించి రుణాలు సేకరించాడు

విజయ్ మాల్యా, నీరవ్ మోడీల కోవలో మరో ఆర్థిక నేరగాడు వెలుగులోకి వచ్చాడు.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన నితిన్ సందేసర ..తప్పుడు డాక్యుమెంట్లతో  పలు బ్యాంకుల నుంచి రూ.5000 కోట్లు సేకరించి రుణాలు సేకరించాడు. అనంతరం వాటిని కట్టకుండా ఎగనామం పెట్టాడు.

దీనిని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకుల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు నితిన్ తన భార్య, సోదరుడు చేతన్ సందేసర, మరదలు దీప్తిబెన్ సందేసర సహా కుటుంబసభ్యులంతా నైజీరియాలో ఉన్నట్లుగా సమాచారం..

ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి స్టెర్లింగ్ బయోటిక్ గ్రూప్‌కు చెందిన రూ.4700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇతనికి అప్పులు ఇచ్చిన వారిలో ఆంధ్రా బ్యాంక్, యూకో బ్యాంక్, ఎస్‌బీఐ, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కన్సార్షియం ఉన్నాయి.  

ఈ వ్యవహారంపై గత నెలలో వార్తలు రావడం.. నితిన్‌ను దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని యూఏఈ అధికారులు ఖండించినట్లుగా ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

click me!