పాలసీదారులు ఇప్పుడు తప్పనిసరిగా ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ ( eIA ) తెరవడం ద్వారా పాలసీలను డీమెటీరియలైజ్ చేయాలి. దీని ద్వారా అన్ని లైఫ్, హెల్త్ ఇంకా సాధారణ ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణను ఒకే చోట చేస్తుంది.
ఏప్రిల్ 1 నుండి పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిబంధనలకు అనుగుణంగా అన్ని పాలసీలను డిజిటల్‌గా జారీ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ( IRDAI ) తప్పనిసరి చేసింది. పాలసీదారులు ఇప్పుడు తప్పనిసరిగా ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ ( eIA ) తెరవడం ద్వారా పాలసీలను డీమెటీరియలైజ్ చేయాలి. దీని ద్వారా అన్ని లైఫ్, హెల్త్ ఇంకా సాధారణ ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణను ఒకే చోట చేస్తుంది.
బీమా రిపోజిటరిస్(Insurance repositories)
ఈ డిజిటలైజేషన్ మార్పుకు నాలుగు బీమా రిపోజిటరీలు సపోర్ట్ ఇస్తున్నాయి: CAMS , Karvy , NSDL డేటాబేస్ మేనేజ్‌మెంట్ (NDML), సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపోజిటరీ ఆఫ్ ఇండియా.
eIA తెరవడం
eIAని తెరవడానికి పాలసీదారులు ఎంచుకున్న రిపోజిటరీ నుండి eIA ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి నింపాలి. ఫారమ్‌ను KYC డాకుమెంట్స్ తో పాటు ఆమోదించబడిన వ్యక్తి లేదా బీమా కంపెనీ బ్రాంచ్ ఆఫీస్‌కు సమర్పించాలి లేదా బీమా రిపోజిటరీకి కొరియర్ చేయవచ్చు.
అవసరమైన డాకుమెంట్స్
ఫార్మ్ తో పాటు ఈ డాకుమెంట్స్ అందించాలి
*కొత్త పాస్‌పోర్ట్ సైజు ఫోటో
*పాన్ కార్డ్
*పుట్టిన తేదీ రుజువు(Date of birth proof)
*ఐడెంటిటీ ప్రూఫ్
*అడ్రస్ ప్రూఫ్
పూర్తి అప్లికేషన్ అందుకున్నప్పుడు దానిని వెరిఫై చేసి ఇంకా ప్రాసెస్ చేయబడుతుంది. eIA అప్లికేషన్ అందించిన ఏడు రోజులలోపు పని అవుతుంది.
ఇ-పాలసీకి మార్చడం
పాలసీ మార్పిడి ఫారమ్‌ను పాలసీదారుడి పేరు, పాలసీ నంబర్, బీమా అకౌంట్ నంబర్ ఇంకా కంపెనీ పేరుతో నింపాలి. దీనిని eIA ఫారమ్‌తో బీమా శాఖకు లేదా ఆమోదించబడిన వ్యక్తికి అందించవచ్చు . మార్పిడి తర్వాత, పాలసీదారులు SMS ఇంకా ఇ-మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ పొందుతారు.
గమనించవలసినవి
*eIA తెరవడం ఇంకా పాలసీలను మార్చడం ఫ్రీ.
*మార్చిన తర్వాత ఫిజికల్ పాలసీ సర్టిఫికేట్ చెల్లదు.