విమాన ప్రయాణానికి కొత్త శకం! భారతదేశ మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన ప్రధాని మోడీ..

By Sandra Ashok KumarFirst Published Oct 31, 2020, 2:41 PM IST
Highlights

గుజరాత్ పర్యటన చివరి రోజున కెవాడియాలో సీప్లేన్ సర్వీస్ వాటర్ ఏరోడోమ్‌ను లాంచ్ చేశారు. నరేంద్ర మోడీ శనివారం అక్టోబర్ 31, 2020న దేశంలోనే మొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించి ప్రయాణించారు.

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడి రెండు రోజుల గుజరాత్ పర్యటన చివరి రోజున కెవాడియాలో సీప్లేన్ సర్వీస్ వాటర్ ఏరోడోమ్‌ను లాంచ్ చేశారు. నరేంద్ర మోడీ శనివారం అక్టోబర్ 31, 2020న దేశంలోనే మొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించి కెవాడియా నుండి సబర్మతి తీరం వరకు సీప్లేన్ లో ప్రయాణించారు.

సీప్లేన్ సర్వీస్ సంబంధించిన ప్రత్యేకమైన విషయాలు

- ఇది భారతదేశపు మొట్టమొదటి బిజినెస్ సీప్లేన్ సర్వీస్.
- ఈ సీప్లేన్ స్టాచ్యు ఆఫ్ యూనిటీ విగ్రహం, కేవాడియా, సబర్మతి రివర్ ఫ్రంట్ మధ్య ప్రయాణ సమయాన్ని మరింత తగ్గిస్తుంది.
- గుజరాత్ రాష్ట్ర ప్రాంతంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతాయితుంది.

also read 
- దీనివల్ల ఉద్యోగ కల్పన అవకాశాలు కూడా పెరుగుతాయి.
- ఈ సీప్లేన్ సర్వీస్ కెవాడియా నుండి అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు అందుబాటులో ఉంటుంది.
- ఇది నర్మదా జిల్లాలోని స్టాచ్యు ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శించడానికి వీలుకల్పిస్తుంది.
- ఒకేసారి 15-18 మంది ప్రయాణికులు ఈ సీప్లేన్ లో ప్రయాణించగలుగుతారు.
- ఉడాన్ పథకం కింద అన్నీ కలిపి వన్ వే ట్రిప్‌కు ఛార్జీ 1500 రూపాయలుగా చెబుతున్నారు.  
- సీప్లేన్ లో ప్రయాణం చేసేటప్పుడు కెవాడియా ప్రాంతంలోని పక్షులను కూడా చూడవచ్చు.
-స్పైస్ జెట్ అక్టోబర్ 31 నుండి అహ్మదాబాద్ నుండి కెవాడియా మార్గంలో రెండు విమానాలను నడుపుతుంది.
-ఈ సీప్లేన్ కోసం స్పైస్ జెట్ 15-18 సీట్ల ట్విన్ ఓటర్ 300 ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే విమానాలలో ఒకటి, ట్విన్ ఒట్టెర్ 300 చాలా సురక్షితమైన విమానాలలో ఒకటి.  

 

PM Shri inaugurates water aerodrome and sea plane service in Kevadia, Gujarat. https://t.co/hss2STi3Zk

— BJP (@BJP4India)
click me!