ముత్తూట్‌ ఫైనాన్స్ ఎండీ కారుపై రాళ్లదాడి, తీవ్రగాయాలు

Siva Kodati |  
Published : Jan 07, 2020, 05:37 PM IST
ముత్తూట్‌ ఫైనాన్స్ ఎండీ కారుపై రాళ్లదాడి, తీవ్రగాయాలు

సారాంశం

దేశంలోని ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్‌పై గుర్తు తెలియని దుండగులు కారుపై రాళ్లతో దాడి చేశారు. 

దేశంలోని ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్‌పై గుర్తు తెలియని దుండగులు కారుపై రాళ్లతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉదయం కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఐజీ ఆఫీసు సమీపంలో అలెగ్జాండర్‌ కారుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయమవ్వడంతో అలెగ్జాండర్‌ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై ముత్తూట్ ఫైనాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐటీయూకు చెందిన వ్యక్తులే జార్జ్‌పై దాడికి పాల్పడ్డారని ఆరోపించగా.. ఈ ఆరోపణలను సీఐటీయూ తోసిపుచ్చింది.

ఇలాంటి హింసాత్మక ఆందోళనలకు తాము పాల్పడబోమని సీఐటీయూ నేత ఒకరు స్పష్టం చేశారు. కాగా గతేడాది డిసెంబర్‌లో ముత్తూట్ ఫైనాన్స్ 160 మంది సిబ్బందిని విధుల్లోంచి తొలగించింది. దీంతో అప్పటి నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 

Also Read:

బ్యాంకుల్లో కుంభకోణాలు జరగకుండా రిజర్వ్ బ్యాంక్ చర్యలు...

బంగారం ధరలు భయపెడుతున్నాయి....రికార్డు స్థాయికి పది గ్రాముల పసిడి ధర

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!