స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి లాటరీ టికెట్ కన్నా ఎక్కువగా అదృష్టం తగులుతూ ఉంటుంది. మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చేస్తుంటాయి. అలాంటి స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ కేవలం 1 లక్ష రూపాయలను రూ. 2.44 కోట్లుగా మార్చేశాయి. ఆ కథేంటో తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించాలంటే చాలా ఓపిక ఉండాలి. కొన్ని స్టాక్స్ ప్రజల అదృష్టాన్ని మారుస్తుంటాయి. కొన్ని స్టాక్స్ మాత్రం రివర్స్ వెళ్ళిపోయి పెట్టుబడిదారులను ముంచేస్తుంటాయి.అయితే కొన్ని స్టాక్స్ మాత్రం పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తుంటాయి. అలాంటి స్టాక్‌ల జాబితాలో జెనస్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (Genus Power Infrastructures Ltd) స్టాక్ పేరు కూడా ఇందులో ఒకటి. 20 ఏళ్ల క్రితం ఈ షేర్‌లో కేవలం రూ.40,000 ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ కూడా నేడు కోటీశ్వరుడు అయ్యాడు. .
ఈ సంస్థ ప్రధానంగా విద్యుత్ మీటర్లను తయారు చేసి విక్రయిస్తుంది. కంపెనీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మీటరింగ్ పరిష్కారాలను కూడా సిద్ధం చేస్తుంది. జెనస్ పవర్ (Genus Power Infrastructures Ltd) స్టాక్ గత 20 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 24,000 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించింది. జీనస్ పవర్ (Genus Power Infrastructures Ltd) జూలై 26న స్టాక్ ఎక్స్ఛేంజీలకు "జెనస్ మిజోరామ్ ఎస్‌పివి ప్రైవేట్ లిమిటెడ్" (Genus Power Infrastructures Ltd) పేరుతో పూర్తి యాజమాన్యంలోని అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, జూలై 27న, ఇది BSEలో 4 శాతం వరకు జంప్ చేసి రూ.183.15 వద్ద ముగిసింది. అయితే ఈరోజు అంటే జూలై 28న ఈ షేరు 2 శాతం క్షీణతతో బీఎస్ఈలో రూ.179.35 స్థాయిలో ట్రేడవుతోంది.
ఒక నెలలో 55 శాతం జంప్
గత నెలలో జీనస్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ (Genus Power Infrastructures Ltd) 55 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 92 శాతం లాభాలను అందించింది. అదేవిధంగా, ఇప్పటి వరకు 2023 సంవత్సరంలో, ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 110% రాబడిని ఇచ్చింది. ఒక సంవత్సరంలో దాని లాభం 130 శాతానికి దగ్గరగా ఉంది. గత 20 సంవత్సరాలలో, ఈ స్టాక్ రాబడి 24000 శాతానికి పైగా ఉంది.
ఇరవై సంవత్సరాల క్రితం, జెనస్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర 75 పైసలు మాత్రమే. నిన్న అంటే జూలై 27న రూ.183.15 వద్ద ముగిసింది. ఒక ఇన్వెస్టర్ 20 ఏళ్ల క్రితం ఈ షేర్‌లో కేవలం 42 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టి, ఇప్పటి వరకు కొనసాగిస్తే, నేడు కోటి రూపాయలను పొందుతున్నాడు. అదేవిధంగా 20 ఏళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుడి పెట్టుబడి విలువ ఇప్పుడు రూ. 2,44,20,000గా మారింది.