Multibagger stock: మల్టీబ్యాగర్ స్టాక్ కోసం చూస్తున్నారా, ఏడాదిలో 1000 శాతం రిటర్న్ ఇచ్చిన టాటా గ్రూప్ స్టాక్

Published : Mar 22, 2022, 01:06 PM IST
Multibagger stock: మల్టీబ్యాగర్ స్టాక్ కోసం చూస్తున్నారా, ఏడాదిలో 1000 శాతం రిటర్న్ ఇచ్చిన టాటా గ్రూప్ స్టాక్

సారాంశం

Multibagger stock: మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం ఇన్వెస్టర్లు నిత్యం ఎదురు చూస్తుంటారు. అయితే టాటా గ్రూపు లాంటి దిగ్గజ కార్పోరేట్ కంపెనీకి చెందిన స్టాక్స్ అద్భుతమైన రిటర్న్స్ అందిస్తున్నాయి. టాటా గ్రూపునకు చెందిన ఈ స్టాక్ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 1000 శాతం రిటర్న్ అందించింది. దానిపై ఓ లుక్కేద్దాం.   

Multibagger stock: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. అయినప్పటికీ ఫండమెంటల్స్ బలంగా ఉన్న కొన్ని స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా రాణిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. వాటిలో టాటాగ్రూపునకు చెందిన ఒక స్టాక్ సైతం మల్టీ బ్యాగర్ లాబాలను అందించింది. 

ఇది పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలను అందించింది. ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్ (Automotive Stampings & Assemblies Ltd.) అనేది టాటా గ్రూప్‌కు చెందిన సంస్థ. ఈ సంస్థ స్టీల్ మెటల్ షీట్లను తయారు చేస్తుంది.

ఆటోమోటివ్ స్టాంపింగ్ & అసెంబ్లీస్ లిమిటెడ్ స్టాక్ (Automotive Stampings & Assemblies Ltd.) ప్రస్తుతం రూ. 375.95 వద్ద ట్రేడవుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ఈ స్టాక్ క్షీణించింది. లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ రికార్డు అద్భుతంగా రాణించింది. ఏకంగా మల్టీ బ్యాగర్ లాభాలను అందించంది.  ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు ఈ స్టాక్ దాదాపు 80 శాతం పెరిగింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ దిశగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత రెండు సెషన్లలో లోయర్ సర్క్యూట్‌ను తాకడంతో ఇది ప్రాఫిట్ బుకింగ్‌లో ఉంది.

ఈ టాటా గ్రూప్ స్టాక్ గత సంవత్సరంలో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా లాభాలను అందించింది. ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు  అద్భుతమైన రాబడిని అందించిన హిస్టరీని కలిగి ఉంది. గత ఏడాదిలో, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ & అసెంబ్లీస్ లిమిటెడ్ (Automotive Stampings & Assemblies Ltd.) షేరు ధర ఒక్కో షేరుకు రూ.35.25 నుంచి రూ.395.70కి పెరిగింది. ఈ కాలంలో ఈ స్టాక్ 1000 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది.

ఆటోమోటివ్ స్టాంపింగ్ & అసెంబ్లీ లిమిటెడ్. (Automotive Stampings & Assemblies Ltd.) షేర్ హిస్టరీ 
ఈ ఏడాది జనవరిలో ఎన్‌ఎస్‌ఈలో జీవితకాల గరిష్ట స్థాయి రూ. 925.45కి చేరిన తర్వాత, దాదాపు ఒక నెలపాటు ఈ షేరు అమ్మకాల ఒత్తిడిలో భారీగా నష్టపోయింది.  అయితే ఫిబ్రవరి లో మాత్రం ఈ స్టాక్ రూ.285 నుంచి రూ.395.70 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 40 శాతం వృద్ధి నమోదైంది. గత 6 నెలల్లో, టాటా  ఈ స్టాక్ సుమారు 575 శాతం ఎగబాకింది మరియు స్టాక్ 58.45 నుండి రూ. 395.70 స్థాయికి పెరిగింది. అదేవిధంగా, గత ఏడాది కాలంలో షేరు రూ.35.25 నుంచి రూ.395.70 స్థాయికి ఎగబాకి, కేవలం ఒక ఏడాది కాలంలోనే 11 రెట్ల కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్