DGCA: చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంతో దేశీయ బోయింగ్ విమానాలపై పెరిగిన DGCA నిఘా

Published : Mar 22, 2022, 12:11 PM IST
DGCA: చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంతో  దేశీయ బోయింగ్ విమానాలపై పెరిగిన DGCA నిఘా

సారాంశం

చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంతో దేశీయ బోయింగ్ విమానాలపై DGCA నిఘాను పెంచేసింది. గడిచిన మూడేళ్లలో బోయింగ్ 737 మాక్స్ విమానాల దుర్ఘనటల్లో దాదాపు 350 మంది ప్రయాణీకులు మరణించారు. దీంతో బోయింగ్ విమానాల భద్రతపై నీలినీడలు ముసురుకున్నాయి.   

చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 ప్రమాదంలో 132 మంది మరణించిన, అనంతరం ఒక్కసారిగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా భారత్ కు చెందిన  DGCA భారతీయ విమానయాన సంస్థ ఆధీనంలోని బోయింగ్ 737 విమానాలను "ప్రత్యేక పర్యవేక్షణ" (increased monitoring)కింద ఉంచిందని దాని ఛైర్మన్ అరుణ్ కుమార్ తెలిపారు. మన దేశానికి చెందిన 3 విమానయాన సంస్థలు, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్  బోయింగ్ 737 విమానాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. 

చైనా బోయింగ్ విమాన దుర్ఘటన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించగా,  ఛైర్మన్ అరుణ్ కుమార్  పిటిఐతో పలు వివరాలు పంచుకున్నారు "విమాన భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని, అందుకే పరిస్థితిని చురుకుగా పర్యవేక్షిస్తున్నామని. 737 బోయింగ్ విమానాలపై నిఘా మరింత పెరిగింది." అని ఆయన పేర్కొన్నారు. 

చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737-800 కున్మింగ్ నుండి గ్వాంగ్‌జౌ వెళ్లే మార్గంలో వుజౌలోని టెంగ్జియాన్ కౌంటీలో కూలి 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది మరణించారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన చైనా ప్యాసింజర్ విమానంలో 133 మందిలో విదేశీయులు ఎవరూ లేరు.

బోయింగ్ 737 మాక్స్ అనేది బోయింగ్ 737-800  ఈ తరహా విమానాల్లో అత్యంత సమర్థవంతమైనదిగా పేరొందింది.  అక్టోబర్ 2018, మార్చి 2019 మధ్య ఆరు నెలల్లో, రెండు బోయింగ్ 737 మాక్స్ విమానాలు ప్రమాదాల్లో చిక్కుకున్నాయి, మొత్తం 346 మంది ప్రయాణికులు మరణించారు. ఈ రెండు ప్రమాదాల తర్వాత, DGCA మార్చి 2019లో భారతదేశంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నిషేధించింది.

DGCA సంతృప్తికి అవసరమైన సాఫ్ట్‌వేర్ దిద్దుబాట్లను బోయింగ్ అమలు చేసిన తర్వాత, 27 నెలల విరామం తర్వాత గత ఏడాది ఆగస్టులో విమానాల వాణిజ్య కార్యకలాపాలు పునఃప్రారంభించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే
Post office: మీ డ‌బ్బులే డ‌బ్బుల‌ను సంపాదిస్తాయి.. ఈ స్కీమ్‌తో ప్రతీ నెల మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయ్