మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నవంబర్ 20 నుంచీ 11 సార్లు ధరల పెంపు..

By S Ashok KumarFirst Published Dec 3, 2020, 3:27 PM IST
Highlights

తాజా పెంపుతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ 11సార్లు ధరలను పెంచాయి. దీంతో గత 11 రోజుల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర చమురు కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ ధరలను మళ్ళీ పెంచాయి. నేడు డీజిల్ ధర 18 నుంచి 20 పైసలు పెరగగా, పెట్రోల్ ధర కూడా 15 పైసల నుంచి 17 పైసలకు పెరిగింది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 17 పైసలు పెరిగి రూ. 82.66కు చేరింది.

డీజిల్‌ ధర లీటర్‌కు 19 పైసలు పెరిగి రూ. 72.84ను తాకింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పన్నులు,  తదితర ఆధారంగా మారుతూ ఉంటాయి. 

కాగా 48 రోజుల తరువాత నవంబర్ 20 నుండి దేశీయంగా పెట్రోల్‌ ధరలు పెరగడం ప్రారంభించాయి. తాజా పెంపుతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ 11సార్లు ధరలను పెంచాయి.

దీంతో గత 11 రోజుల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక డీజిల్‌ ధర అధికంగా లీటర్‌ రూ. 1.80 వరకూ పెంచినట్లు తెలియజేశారు. 

also read 

విదేశీ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధరలు దాదాపు 2 శాతం ఎగిసాయి. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు యూ.కే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ముడి చమురు ధరల పెంపుకు దారితీశాయి.

ప్రస్తుతం న్యూయార్క్‌ మార్కెట్లో చమురు బ్యారల్‌ 45.30 డాలర్లకు చేరగా, లండన్‌ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48.30 డాలర్లను తాకింది. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. 


దేశంలోని ప్రధాన మెట్రోలలో ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు

ఢీల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.66, డీజిల్ ధర రూ.72.84     
కోల్‌కతా లీటరు పెట్రోల్ ధర రూ.84.18, డీజిల్ ధర రూ.76.41    
ముంబై  లీటరు పెట్రోల్ ధర రూ.89.33, డీజిల్ ధర రూ. 79.42
చెన్నై లీటరు పెట్రోల్ ధర రూ.85.59, డీజిల్ ధర రూ.78.24     
 హైదరాబాద్ లీటరు పెట్రోల్ ధర రూ.85.97, డీజిల్ ధర రూ. 79.48    

పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవారిస్తుంటారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. 

click me!