Mukesh Ambani vs Anil Ambani : అన్న ఆకాశం, తమ్ముడు పాతాళం. అనిల్ అంబానీ చేసిన తప్పులు ఇవే, అసలు కథ తెలుసుకోండి

By Krishna AdithyaFirst Published Jul 5, 2023, 1:35 PM IST
Highlights

రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ  మళ్లీ వార్తల్లో  వ్యక్తిగా నిలిచారు. ఆయన భార్య టీనా అంబానీ విదేశీ మారకపు నిబంధనల (ఫెమా) విషయంలో ప్రశ్నిస్తున్నారు.  అదే సమయంలో అనిల్ అంబానీని సైతం ఈడీ గంటల తరబడి విచారించింది. అన్న ముఖేష్ ఆసియలోనే అత్యంత సంపన్నుడు అయితే, తమ్ముడు పాతాళానికి ఎందుకు పడిపోయాడు కారణం తెలుసుకోండి..

దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో అంబానీ కుటుంబం ఒకటి. ధీరూభాయ్ అంబానీ పునాది వేసిన వ్యాపారం రెండుగా చీలి, ఒక భాగం ముఖేష్ అంబానీకి, మరో భాగం అనిల్ అంబానీకి వచ్చింది. ముఖేష్ అంబానీ వాటాలో వచ్చిన భాగం నేడు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో చేరగా. మరోవైపు అనిల్ అంబానీకి వచ్చిన వాటా భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అన్నయ్య తన వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా పెంచుకొని, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ఒకడు అయ్యాడు. మరో సోదరుడు వ్యాపారం నిర్వహించలేక దివాళా తీశాడు. అంబానీ బ్రదర్స్ కథ, అలాగే అనిల్ అంబానీ చేసిన తప్పుల గురించి తెలుసుకుందాం. 

కథ ఇలా మొదలైంది

Latest Videos

ధీరూభాయ్ అంబానీ రిలయన్స్‌కు పునాది వేశారు. క్రమంగా, అతను తన ఇద్దరు కొడుకులను ఆ వ్యాపారంలో చేర్చుకున్నాడు. ముఖేష్ అంబానీ 1981లో రిలయన్స్‌లో, అనిల్ అంబానీ 1983లో చేరారు. జూలై 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, రిలయన్స్ గ్రూప్‌కు ముఖేష్ అంబానీ ఛైర్మన్‌గా, అనిల్ అంబానీ మేనేజింగ్ డైరెక్టర్‌గా మారారు. కొన్నాళ్లకే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే, ఇద్దరు సోదరుల మధ్య వివాదం రిలయన్స్ వ్యాపారంపై ప్రభావం చూపలేదు. రిలయన్స్ బాధ్యతలను ముఖేష్, అనిల్ అంబానీ స్వీకరించినప్పుడు, ఆ సమయంలో ఇద్దరు సోదరుల ఉమ్మడి నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు. 2004 సంవత్సరంలో ఇది 6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, 2005 సంవత్సరంలో 7 బిలియన్ డాలర్లకు పెరిగింది.

వివాదం తర్వాత వ్యాపార విభజన

2004లో తొలిసారిగా ముఖేష్, అనిల్ అంబానీల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. 2005లో, రిలయన్స్ వ్యాపారం రెండింటి మధ్య విభజన జరిగింది. రిలయన్స్ విభజన తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్ప్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో ముఖేష్ అంబానీకి వాటాలు వచ్చాయి. ఆర్‌కామ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ వంటి కంపెనీలు అనీల్ అంబానీ వాటా కింద వచ్చాయి. 

తమ్ముడు అనిల్ వాటాలో రిలయన్స్ ఇన్ఫోకామ్ వచ్చింది. వ్యాపార విభజన సమయంలో, ఇద్దరు సోదరుల మధ్య ఒప్పందం కుదిరింది, దానిలో భాగంగా అనిల్‌కు నష్టం కలిగించే వ్యాపారాన్ని ముఖేష్ ప్రారంభించకూడదని షరతు పెట్టారు, కానీ ఈ ఒప్పందం 2010 సంవత్సరంలో ముగిసింది. ఈ ఒప్పందం ముగిసిన తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ లిమిటెడ్ (IBSL)లో 95% వాటాను కొనుగోలు చేసింది. తర్వాత ఇది రిలయన్స్ జియోగా ప్రారంభించారు. 2016లో రిలయన్స్ జియో ప్రారంభం టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. 

జియో ప్రజలకు 6 నెలల పాటు ఉచిత కాలింగ్, డేటా సేవలు అందించింది. దీని వలన ప్రజలలో జియో ప్రజాదరణ పొందింది. అదే సమయంలో రిలయన్స్ ఇన్ఫోకామ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. 

అనిల్ అంబానీ తన తప్పిదాలతో  నాశనం 

నిజానికి రిలయన్స్ విడిపోయిన తర్వాత, అనిల్ అంబానీకి మంచి భవిష్యత్తు ఉన్న వ్యాపారాలు చేతికి వచ్చాయి. కానీ అసంపూర్ణమైన వ్యాపార ప్రణాళిక, ఖచ్చితమైన ప్రణాళిక లేకపోవడం, దూర దృష్టి లోపం కారణంగా అనిల్ అంబానీ వ్యాపారం దివాళా వైపు కదులుతూ వచ్చింది. వ్యాపార విభజన తర్వాత, అనిల్‌కు సౌరశక్తి నుండి టెలికాం రంగం అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాల్లో ఎదగాలని కొత్త ప్రాజెక్టులపై పందెం కాసాడు, కానీ ఖర్చును అంచనా వేయలేకపోయాడు. ఖర్చుతో పోల్చితే వారికి రాబడి రాలేదు. ఇది అతని పతనానికి ప్రధాన కారణంగా మారింది. ఒక వ్యాపారంపై సరిగ్గా దృష్టి ఉంచలేకపోవడం, ఒక వ్యాపారం నుండి మరొక వ్యాపారంలోకి అనిల్ అంబానీ త్వరగా పెట్టుబడులు పెట్టడం, అతడి వ్యాపార సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. అనిల్ అంబానీకి వ్యూహం లోపించింది. సరైన వ్యూహం లేకుండా అనేక వ్యాపారాలలోకి ప్రవేశించాడు. దీంతో అప్పుల భారం పెరుగుతూ వచ్చింది.

అన్నఆసియాలో అత్యంత సంపన్నుడు.. తమ్ముడు దివాళా 

అనిల్ అంబానీ తన స్వంత తప్పిదాల కారణంగా చిక్కుకుపోతూనే ఉన్నాడు. అదే సమయంలో, ముఖేష్ అంబానీ సంపద పెరుగుతూనే ఉంది. నేడు ప్రపంచంలోని టాప్‌ 10 సంపన్నుల జాబితాలో ముఖేష్‌ అంబానీ ఉన్నారు.  మరోవైపు, అనిల్ అంబానీ సంపద తగ్గుతూనే ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ తనను తాను దివాలా తీసినట్లు ప్రకటించారు.

ముకేశ్ అంబానీ సహాయం చేయడంతో అప్పుల నుండి కాస్త విముక్తి పొందాడు. ఫోర్బ్స్ ప్రకారం, ముఖేష్ అంబానీ ఆస్తులు నేడు  85 బిలియన్లకు పైగా ఉన్నాయి. కాగా, అనిల్ అంబానీ నేడు దివాళా తీశారు. అనిల్ అంబానీ చాలా కేసుల్లో ఇరుక్కొని చిక్కులు మూటగట్టుకున్నారు. 

click me!