ముకేష్ అంబానీ సంచలన నిర్ణయం.. వారసులకు సమాన బాధ్యతలు..

By Sandra Ashok KumarFirst Published Aug 14, 2020, 1:47 PM IST
Highlights

 ముకేష్ అంబానీ వ్యాపార వారసత్వ బాధ్యతలను కుటుంబం సభ్య్లులకు అందరికీ సమానంగా పంచేందుకు సిద్దమయ్యారు.ఇందుకోసం  ‘ఫ్యామిలీ కౌన్సిల్’ ను ఏర్పాటు చేస్తున్నారని, చర్చల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తులు తెలిపారు.

ప్రపంచంలోని నాల్గవ ధనవంతుడైన ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముకేష్ అంబానీ వ్యాపార వారసత్వ బాధ్యతలను కుటుంబం సభ్య్లులకు అందరికీ సమానంగా పంచేందుకు సిద్దమయ్యారు.ఇందుకోసం  ‘ఫ్యామిలీ కౌన్సిల్’ ను ఏర్పాటు చేస్తున్నారని, చర్చల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తులు తెలిపారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులైన ఆకాష్, ఇషా, అనంత్ సహా ఈ కౌన్సిల్ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఈ కౌన్సిల్‌లో కుటుంబంలోని పెద్దలు, ముగ్గురు పిల్లలు, సలహాదారులు, సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.

ఆర్‌ఐఎల్‌లో ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కౌన్సిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఫోరమ్ ప్రతి శాఖకు అంగీకరించిన పద్ధతిలో ప్రాతినిధ్యాన్ని అందిస్తుంది అలాగే వ్యాపారాలకు సంబంధించిన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

also read బ్రాండ్‌ ఫ్యాక్టరీ బంపర్ ఆఫర్.. 2 కొంటే 3 ఉచితం.. ...

4" 63 ఏళ్ల అంబానీ, వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 1973లో  ఆర్‌ఐ‌ఎల్ ను స్థాపించిన ముకేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ మరణం తరువాత అంబానీ సోదరులు తన తండ్రి వ్యాపారాలను పంచుకున్నారు.

అక్టోబర్ 2014లో, ఆకాష్, ఇషా అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్లుగా చేరారు. అతి పిన్న వయసుడైన అనంత్‌ను మార్చిలో అదనపు డైరెక్టర్‌గా జియో ప్లాట్‌ఫాం బోర్డులో నియమించారు.

ఆకాష్, ఇషా కూడా జియో ప్లాట్‌ఫాంల బోర్డులో ఉన్నారు. జియో ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఇషా అంబానీ డైరెక్టర్ కూడా. ఆకాష్, అనంత్ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు, ఇషా యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజి చేసింది. 

 

click me!