Mukesh Ambani: నువ్వా- నేనా.. గౌతమ్ అదానీని దాటేసిన ముకేష్ అంబానీ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 09, 2022, 03:35 PM IST
Mukesh Ambani: నువ్వా- నేనా.. గౌతమ్ అదానీని దాటేసిన ముకేష్ అంబానీ

సారాంశం

24 గంటలు గడిచేసరికి ముకేశ్‌ అంబానీ మరోసారి దూసుకువచ్చి తన  మొదటి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో ముకేశ్ మొద‌టి స్థానానికి రాగా.. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఏషియా నంబర్‌ 2, ప్రపంచంలో 11 స్థానానికి పరిమితమయ్యారు.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ జాబితాలో ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా మారిన గౌతమ్‌ అదానీ కేవలం ఒక్క  రోజు మాత్రమే ఆ స్థానంలో ఉన్నారు. 24 గంటలు గడిచేసరికి ముకేశ్‌ అంబానీ మరోసారి దూసుకువచ్చి తన  మొదటి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో ముకేశ్ మొద‌టి స్థానానికి రాగా.. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఏషియా నంబర్‌ 2, ప్రపంచంలో 11 స్థానానికి పరిమితమయ్యారు.

ఫిబ్రవరి 9 బుధవారం ఉదయం బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌ జాబితాలో ముకేశ్‌ అంబానీ సంపద 89.2 బిలియన్‌ డాలర్లగా నమోదు అయ్యింది. మున‌ప‌టి రోజు అంబానీ నిక‌ర‌ విలువ 87.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక గౌతమ్‌ అదానీ సంపద 86.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మునపటి రోజు ఈ మొత్తం 88.5 బిలియన్లుగా ఉండేది. ఒక్క రోజు వ్యవధిలో ముకేశ్‌ సంపదలో 1.33 బిలియన్‌ డాలర్లు వచ్చి జమ కాగా అదానీ ఖాతా నుంచి 2.16 బిలియన్‌ డాలర్లు కరిగిపోయాయి. దీంతో ముకేశ్ ఆసియా నంబర్‌ 1 స్థానంతో పాటు ప్రపంచం కుబేరుల్లో పదో స్థానానికి మరోసారి చేరుకున్నారు. 

బ్లూమ్‌బర్గ్‌ జాబితాలో అంబానీ, అదానీలు వరుసగా 10వ, 11వ స్థానాల్లో ఉండగా టాప్‌ 100 జాబితాలో 38వ స్థానంలో అజీమ్‌ ప్రేమ్‌జీ (33.8 బిలియన్‌ డాలర్లు), 48వ స్థానంలో శివ్‌నాడార్‌ (29 బిలియన్‌ డాలర్లు), 79వ స్థానంలో రాధాకిషన్‌ దమానీ (21.2 బిలియన్‌ డాలర్లు), 82వ స్థానంలో లక్ష్మీ మిట్టల్‌ (21 బిలియన్‌ డాలర్లు)లు ఉన్నారు. 

అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అంబానీ ఆస్తులు విలువ 89.2 బిలియన్ డాలర్లు కాగా.. 11వ స్థానంలో ఉన్న అదానీ ఆస్తుల విలువ 86.3 బిలియన్​ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 239.6 బిలియన్​ డాలర్లతో ఎలాన్​ మస్క్​ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్​ 194.6 బిలియన్​ డాలర్లతో రెండో స్థానంలో, జెఫ్​ బెజోస్​ 183.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్​గేట్స్​132.2 బిలియన్​ డాలర్ల సంపదతో 4వ‌ స్థానంలో కొనసాగుతున్నారు.

అంబానీ వ్యాపారాలివే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ పేరుతో అదానీ వ్యాపారాలు నడుస్తాయి. ముంబయి కేంద్రంగా ఈ గ్రూప్ కార్యకలాపాలు సాగుతుంటాయి. రిలయన్స్ గ్రూప్​లో పెట్రోలియం, సహజవాయు, పెట్రో కెమిమికల్స్​, టెలికాం, టెక్స్​టైల్స్​, రిటైల్​, మీడియా, టెలివిజన్​ ఎంటర్​టైన్మెంట్​, ఫినాన్షియల్ సర్వీసులు ముఖ్యమైన వ్యాపారాలు.

అదానీ వ్యాపారాలు ఇవే..!
అదానీ వ్యాపారాలు గుజరాత్​లోని అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తాయి. అదానీ వ్యాపారాల్లో ముఖ్యమైనవి పోర్ట్స్​, విద్యుత్​, మైనింగ్​, పునరుత్పాదక విద్యుత్​, ఎయిర్​పోర్ట్​ ఆపరేషన్స్​, ఆయిల్​ అండ్ గ్యాస్​, ఫుడప్​ ప్రాసెసింగ్​, మౌలిక సదుపాయాలు.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్