Mukesh Ambani: ముఖేష్ అంబానీ మరదలు ఎవరో తెలిస్తే...షాక్ తినడం ఖాయం..

By Krishna Adithya  |  First Published Sep 15, 2023, 1:53 PM IST

ముఖేష్ అంబానీ కుటుంబం తరచు తమ విలాసవంతమైన జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆయన కుటుంబంతోపాటు వారి బంధువుల గురించి కూడా తెలుసుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ రోజు ముఖేష్ అంబానీ సతీమణి అయిన నీతా అంబానీ సోదరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో అంబానీ కుటుంబం ఒకటి . అంబానీ ,  సంపన్నమైన జీవనశైలి, వేడుకలు మొదలైన విశేషాల వల్ల ఆయన కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తుంది. ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీతో కలిసి ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసమైన యాంటిలియాలో నివసిస్తున్నారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో నీతా అంబానీ ఒకరు. సామాజిక కార్యకర్తగా కూడా నీతా అంబానీ పేరు సంపాదించారు. అయితే ఆమె తన విలాసవంతమైన జీవితం వల్ల  కూడా వార్తల్లో నిలుస్తుంటారు. అంబానీ కుటుంబంలో రావడానికి ముందు నీతా అంబానీ జీవితం గురించి చాలా మందికి తెలియదు. అలాగే ఆమె తోబుట్టువుల గురించి కూడా  చాలా మందికి తెలియదు. 

మమతా దలాల్ నీతా అంబానీకి చెల్లెలు. నీతా, మమత ఇద్దరూ గుజరాతీ కుటుంబంలో జన్మించారు. రవీంద్రభాయ్ దలాల్, పూర్ణిమ దలాల్ దంపతుల చిన్న సంతానం మమతా దలాల్. నీతా అంబానీ కంటే మమత నాలుగేళ్లు చిన్నది. నీతా అంబానీలాగే మమతా టీచింగ్‌ ప్రొఫెషన్ ఎంచుకుంది. మమత దలాల్ ప్రస్తుతం ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీచింగ్ సేవలు అందిస్తోంది. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖానా, సచిన్ టెండూల్కర్ పిల్లలకు మమతా దలాల్ పాఠాలు చెప్పినట్లు పలు సందర్భాల్లో తెలిసింది. 

Latest Videos

అంబానీ కుటుంబ వేడుకల్లో మమతా దలాల్ కూడా తరచూ కనిపిస్తుంటారు. నీతా అంబానీ సోదరి అయినప్పటికీ మమతా దలాల్ తన సోదరితో చాలా అరుదుగా కనిపిస్తారు. ఇదిలా ఉంటే, నీతా అంబానీకి తన సోదరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  మమతా దలాల్ ఆస్తులపై ఇంకా ఎలాంటి నివేదికలు లేవు. ఇదిలా ఉంటే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తులు 95.1 బిలియన్ డాలర్లు కావడం విశేషం. 

click me!