లోన్ సెటిల్మెంట్ జరిగిన 30 రోజులలోపు కస్టమర్లకు ఆస్తి పత్రాలను రిటర్న్ చేయాలి..బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్

By Krishna Adithya  |  First Published Sep 14, 2023, 6:01 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు, ఇతర సంస్థలకు ముఖ్యమైన నోటీసును జారీ చేసింది. లోన్ సెటిల్మెంట్ జరిగిన 30 రోజులలోపు ఆస్తి పత్రాలను విడుదల చేయాలని బ్యాంకులు,ఇతర రుణ సంస్థలను ఆర్‌బిఐ ఆదేశించింది. రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన, 30 రోజులలోపు వారిపై నమోదైన అన్ని ఛార్జీలను తొలగించాలని నోటీసులో పేర్కొంది.


పూర్తి రుణాన్ని తిరిగి చెల్లించిన 30 రోజుల్లోగా తమ బ్యాంకులో డిపాజిట్ చేసిన స్థిరాస్తి లేదా వారసత్వానికి సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలను కస్టమర్లకు తిరిగి ఇవ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్  ఆదేశించింది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వడంలో జాప్యం చేస్తే రోజుకు రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాగే, ఈ కాలంలో ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది. 

అలాగే, అసలు ఆస్తి పత్రాలను విడుదల చేయడంలో జాప్యం జరిగితే, బ్యాంక్స్ రెగ్యులేటరీ అథారిటీ దానికి కారణాన్ని అడుగుతుంది. అటువంటి జాప్యానికి గల కారణాల గురించి రుణగ్రహీతకు తెలియజేస్తుంది. రుణం ఇచ్చే బ్యాంకు ఆలస్యానికి బాధ్యత వహిస్తే ఆలస్యానికి రోజుకు 5,000 జరిమానా విధిస్తుంది. రుణగ్రహీతకు పరిహారం చెల్లిస్తామని ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది.

Latest Videos

ఆస్తి పత్రాలకు నష్టం వాటిల్లిన సందర్భంలో, బ్యాంకులు రుణగ్రహీతకు ఆస్తి పత్రాల సర్టిఫైడ్ కాపీలు అందించాలి. అంతేకాదు దానికి సంబంధించిన ఖర్చులను భరించాలి. నకిలీ పత్రాలను అందించడానికి 30 రోజుల అదనపు సమయం అందిస్తుంది. ఆ తర్వాత కూడా జాప్యం జరిగితే రోజూవారీగా జరిమానా విధిస్తామని పేర్కొంది. మొత్తం రుణం సెటిల్ అయిన తర్వాత కూడా రుణ గ్రహీతకు ఒరిజినల్ పత్రాలు అందించడంలో బ్యాంకులు జాప్యం చేస్తున్నాయని ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 18న లోన్ ఖాతాలపై బ్యాంకులు జరిమానా విధించే ప్రక్రియపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కస్టమర్లు రుణాలు పొందే సమయంలో షరతులను పాటించనప్పుడు అనేక బ్యాంకులు స్థిర వడ్డీ రేటుపై పెనాల్టీ రూపంలో అధిక వడ్డీని విధించడాన్ని RBI గమనించింది. దీనిని నిరోధించడానికి, RBI ఈ మార్గదర్శకాలు వీటిని జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.

click me!