
భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ దుబాయ్‌లో విలాసవంతమైన బీచ్ సైడ్ బంగ్లాను కొనుగోలు చేసేందుకు టై అప్ అయ్యారు. మీడియా కథనాల ప్రకారం, ముఖేష్ అంబానీ దుబాయ్‌లోని బీచ్ సైడ్ విల్లా మిస్టీ కొనుగోలుదారి. ఈ విల్లా ధర 80 మిలియన్ డాలర్లు అంటే సుమర్లు రూ. 8 కోట్లు.
ముఖేష్ అంబానీ అక్కడి నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుదారి. మీడియా నివేదికల ప్రకారం, పామ్ జుమేరా బీచ్‌లోని ఈ ప్రాపర్టీని ఈ సంవత్సరం ప్రారంభంలో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం కొనుగోలు చేశారు.
అంబానీ కొత్త విల్లాలో 10 బెడ్‌రూమ్ లు, ప్రైవేట్ స్పా, ఇండోర్ అండ్ అవుట్‌డోర్ స్విమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి. దుబాయ్ నగరం అత్యంత సంపన్నులకు ఇష్టమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతోంది. లాంగ్ టర్మ్ గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టడం ద్వారా విదేశీయులకు ఇల్లు కొనుగోలు చేయడాన్ని అక్కడి ప్రభుత్వం సులభతరం చేసింది. బ్రిటీష్ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హాం, హిందీ సినిమా కింగ్ షారూఖ్ ఖాన్ వంటి సెలెబ్రిటిలు ముకేష్ అంబానీలకు పొరుగువారిగా ఉంటారు. ఈ దుబాయ్ ప్రాపర్టీ డీల్ ఇంకా రహస్యంగా ఉంది. రిలయన్స్ దీనిపై అధికారికంగా స్పందించలేదు.
మిలియన్ డాలర్ల ఖర్చు
మీడియా కథనాల ప్రకారం, దుబాయ్‌లోని ఈ ప్రాపర్టీ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచారు. దీనిని సొంతం చేసుకోవడానికి అలాగే భద్రత కోసం అంబానీ మిలియన్ల డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెపుతున్నారు. నివేదికల ప్రకారం,ముకేష్ అంబానీ సహాయకుడు, గ్రూప్‌లోని కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమల్ నత్వానీ విల్లాను నిర్వహిస్తారు. అయితే, అంబానీ 27 అంతస్తుల సొంత నివాసం యాంటిలియా ముంబైలో ఉంది. ఇందులో మూడు హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్ స్థలం, 50 సీట్లతో సినిమా థియేటర్, గ్రాండ్ బాల్‌రూమ్, తొమ్మిది ఎలివేటర్‌లు ఉన్నాయి.
విదేశాల్లో రియల్ ఎస్టేట్ ఫూట్ ప్రింట్ ను అంబానీ కుటుంబం పెంచుకుంటోంది. గత సంవత్సరం రిలయన్స్ UKలో స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు $79 మిలియన్లు వెచ్చించింది, ఇందులో అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ కోసం జార్జియన్ కాలం నాటి భవనం ఉంది, అంతేకాదు తాజాగా ఆకాష్ అంబానీ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.