వాహనదారులకు భారీ ఉపశమనం: పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. లీటరు ధర అతితక్కువ..

By asianet news teluguFirst Published Oct 22, 2022, 8:52 AM IST
Highlights

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గుల మధ్య జాతీయ మార్కెట్లో మే 22 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ప్రతిరోజూ లాగానే భారతీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను 22 అక్టోబర్ 2022 ఉదయం అప్‌డేట్ చేశాయి. దీంతో జాతీయ మార్కెట్‌లో ఇంధన (పెట్రోల్-డీజిల్) ధరలు స్థిరంగా ఉన్నాయి. అక్టోబర్ 22న కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని అన్ని నగరాల్లో ఇంధన ధరలు యధావిధిగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గుల మధ్య జాతీయ మార్కెట్లో మే 22 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. అంతేకాకుండా కోల్‌కతాలో పెట్రోల్ ధర  రూ.106.03 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర లీటరుకు రూ.94.24గా ఉంది.

కొత్త ధరల ప్రకారం, ఇండియాలో పెట్రోల్ ధర పోర్ట్ బ్లెయిర్‌లో అతితక్కువగా ఉండగా, రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఆత్యధికంగా  ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. 

బ్రెంట్ క్రూడ్  $1.12 పెరిగి $93.50/బ్యారెల్ వద్ద స్థిరపడింది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) $85.05/బ్యారెల్ వద్ద 54 సెంట్లు పెరిగింది.  

రాష్ట్ర స్థాయి పన్ను కారణంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భిన్నంగా ఉంటాయి.   అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. అయితే పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా మారలేదు.

click me!