అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు పాల్గొన్నారు. అయితే జూలై 12న వివాహ వేడుక జరగనుంది. ఈ వేడుకను రెట్టింపు చేయడానికి, అంబానీ ప్రజల కోసం ఉచిత జియో రీఛార్జ్‌ను ప్రకటించినట్లు నివేదికలు వ్యాపించాయి. అయితే ఇందులో అసలు ఎంత వరకు నిజం ఉంది అనేది చూద్దాం...
ముంబై : అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి జియో ఉచిత ఆఫర్ అందిస్తుంది. జియో కస్టమర్లకు 30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే రూ. 259 ఉచిత రీఛార్జ్ ఆఫర్ ఇవ్వబడింది అంటూ సోషల్ మీడియాలో మెసేజెస్ హల్ చల్ చేస్తున్నాయి. నిర్ణీత రోజుల పాటు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటూ వైరల్ అవుతున్న ఈ మెసేజ్ తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ మెసేజ్ నిజం కాదు తప్పుడు మెసేజ్. కొందరు ఈ తప్పుడు మెసేజ్ ని ప్రచారం చేస్తున్నారు. నిజానికి జియో మాత్రం అలాంటి ఏ ఆఫర్ ప్రకటించలేదు.
తాజాగా జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో చాలా మంది బాలీవుడ్ నటీనటులు డ్యాన్స్ కూడా చేశారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, పలువురు సహా ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. అనంత్ అంబానీ-రాధిక వివాహం జూలై 12న జరగనుంది. దీని కోసం జియో ఉచిత ఆఫర్ ప్రకటించినట్లు ఫేక్ మెసేజ్ ప్రచారంలోకి వచ్చింది.
Jio అధికారిక వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఈ ఆఫర్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఉచిత జియో రీఛార్జ్ మెసేజ్ నకిలీది. రిలయన్స్ జియో అటువంటి ఆఫర్ ఏదీ ప్రకటించలేదని జియో వర్గాలు ధృవీకరించాయి.
సోషల్ మీడియాలో ఉచిత జియో రీఛార్జ్ మెసేజ్ తీవ్రంగా వ్యాపించింది. దీనిపై స్కామర్లు పలు కామెంట్లు కూడా చేశారు. నేను ఫ్రీ రీఛార్జ్ చేసాను. ధన్యవాదాలు జియో అంటున్న చాలా స్కామ్ రిప్లయ్స్ చూడవచ్చు. ఉచిత రీఛార్జ్ లింక్ మెసేజ్ క్రింద ఇలా చూడొచ్చు. ఈ లింక్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే కేవలం 259 రూపాయలే కాకుండా ఖాతాలోని డబ్బు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. స్కామ్ డిటెక్టర్‌తో ఈ లింక్‌ని చెక్ చేయడం ద్వారా దాని అతేంటిసిటీ వెల్లడైంది.
అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చాల గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు పెళ్లి అంతకన్నా అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీని కోసం ఉచిత రీచార్జ్, ఉచిత ఆఫర్ మెసేజ్ లతో కస్టమర్లు మోసపోకూడదు.