గిఫ్ట్స్ కోసం కోట్లు ఖర్చు .. కార్స్, నెక్లెస్ నుండి దీపావళి గిఫ్ట్ వరకు ఆశ్చర్యపోవాల్సిందే..

By Ashok kumar Sandra  |  First Published Jan 4, 2024, 2:05 PM IST

కొన్నేళ్లుగా అంబానీ కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఇచ్చుకున్న ఖరీదైన గిఫ్ట్స్ అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. 
 


భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అండ్  ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో, వేడుకల్లో ఒకరికొకరు గిఫ్ట్స్  ఇవ్వడం అంబానీ కుటుంబంలో నిత్యం కనిపించే దృశ్యం. ఈ లగ్జరీ బహుమతుల ధర తెలిస్తే  మీరు ఆశ్చర్యపోతారు. 

కొన్నేళ్లుగా అంబానీ కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఇచ్చుకున్న ఖరీదైన గిఫ్ట్స్ అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. 

Latest Videos

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకాకు 2019లో నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌లలో ఒకదాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ నెక్లెస్ ధర ఎంత అనుకుంటున్నారు అక్షరాలా 451 కోట్లు.  ఈ నెక్లెస్‌లో 229.52 క్యారెట్ల వజ్రాలు, 407.48 క్యారెట్ల Yellow Sapphire or Pukhraj  ఉన్నాయి.

ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీ 44వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు 240 కోట్ల విలువైన A319 లగ్జరీ జెట్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాగే నీతా అంబానీకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌ని బహుమతిగా ఇచ్చారు. ఈ 10 కోట్ల విలువైన వాహనాన్ని దీపావళి కానుకగా అందించారు. నీతా అంబానీ  కొత్త రోల్స్ రాయిస్ ఇప్పుడు భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా చెప్పబడుతుంది. 

19 జనవరి 2023న, ముకేశ్ అంబానీ అండ్  నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సంగతి మీకు తెలిసిందే. అనంత్ తన స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో ముంబైలోని వారి నివాసం యాంటిలియాలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆకాష్ అంబానీ అనంత్‌కు రూ.13,218,876 విలువైన 18కే పాంథర్ డి కార్టియర్ బ్రూచ్‌ను బహుమతిగా ఇచ్చారు.

కాగా, ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడికి బెంట్లీ కాంటినెంటల్ జిటిసి కారును బహుమతిగా ఇచ్చారు. ఈ లగ్జరీ కారు ధర 4.5 కోట్లుగా అంచనా. 

click me!